Advertisement
ఈరోజుల్లో ప్రేమ వివాహాలు ఎక్కువైపోయాయి. ఎక్కడ చూసినా ప్రేమ పెళ్లిల్లే కనపడుతున్నాయి. పెద్దల కుదిర్చిన పెళ్లిళ్లు చాలా తక్కువగా ఉంటున్నాయి. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఇష్టా ఇష్టాలకి విలువనిచ్చి ప్రేమించిన వాళ్ళతో పెళ్లి చేయడానికి ఒప్పుకుంటున్నారు. అయితే కొంతమంది బాగానే ఉంటారు కానీ కొంతమంది మాత్రం ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత ఒకరికొకరికి నప్పకపోవడం ఇబ్బందులకి గురవడం చూస్తున్నాము.
Advertisement
Advertisement
తాజాగా తాడిపత్రిలో నూతన వధూవరుల విషయంలో ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. పుట్లూరు మండలం గురువుచింతపల్లికి చెందిన రమాదేవి తాడిపత్రి మండలానికి చెందిన మంజునాథ్ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకున్నారు. అంతా బాగుంది అనుకున్నారు కానీ సోమవారం రమాదేవి ఆత్మహత్య చేసుకుంది రైలు కింద పడి ప్రాణాలు తీసుకుంది. భార్య ఆత్మహత్య గురించి తెలుసుకుని భర్త కూడా రైల్వే ట్రాక్ పై శవమై కనిపించాడు వరకట్న వేధింపులు కారణంగానే ఇలా జరిగిందని రమాదేవి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Also read: