Advertisement
హెడ్డింగ్ చూసి కన్ఫ్యూజ్ అయ్యారా? ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ అయింది కదా అని అనుకుంటున్నారా? మీరు అనుకునేది కరెక్టే. కానీ, ఈ హెడ్డింగ్ కూడా కరెక్టే. కాకపోతే బ్రేక్ పడింది ఓటీటీ రిలీజ్ కి. అవును.. యశోద సినిమా ఓటీటీ విడుదలకు సిటీ సివిల్ కోర్టు నో చెప్పింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి.
Advertisement
తమ హాస్పిటల్ పరువు పోయేలా సినిమాలో చూపించారని ఈవీఏ ఐవీఎఫ్ హాస్పటిల్ యాజమాన్యం పిటిషన్ దాఖలు చేసింది. సమంత క్యారెక్టర్ లో తమ ఆస్పత్రి ప్రతిష్టను దెబ్బతీసేలా చూపించారని పేర్కొంది. దీనిపై విచారణ జరిపింది న్యాయస్థానం. యశోద ప్రొడక్షన్ కు నోటీసులు జారీ చేసింది. సినిమాను ఓటీటీలో డిసెంబర్ 19 వరకు విడుదల చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 19కు వాయిదా వేసింది కోర్టు.
Advertisement
కొత్త దర్శకుడు హరి హరీష్ దర్శకత్వంలో సమంత లేడీ ఓరియంటెడ్ చిత్రంగా వచ్చింది యశోద. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ దీన్ని నిర్మించారు. బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో నిలబడింది ఈ చిత్రం. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషించారు.
థియేటర్లలో సందడి చేస్తున్న ఈ యశోద సినిమా త్వరలో ఓటీటీలో రిలీజ్ అవుతోందని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం సాగుతోంది. డిసెంబర్ రెండవ వారం విడుదల చేస్తారని టాక్. అయితే.. ఇప్పుడు కోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో డిసెంబర్ 19 వరకు విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత కూడా కోర్టు తీర్పును బట్టే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.