Advertisement
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. డిస్ట్రిక్ట్ అండ్ స్టేషన్స్ కోర్టు లో ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన విడుదల అయింది. తెలంగాణ రాష్ట్రం మెదక్ లోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేషన్స్ కోర్టు ఒప్పంద ప్రాతిపాదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 12 పోస్టులు ఉన్నాయి. ఇక పోస్టుల వివరాల్లోకి వెళితే, సీనియర్ సూపరింటెండెంట్-01, సీనియర్ అసిస్టెంట్-01, స్టెనోగ్రాఫర్ గ్రేడ్03-01, జూనియర్ అసిస్టెంట్లు-02, డ్రైవర్-01, టైపిస్ట్-02, ఆఫీస్ సబార్డినేట్-04 ఉన్నాయి.
Advertisement
అర్హత విషయానికి వస్తే పోస్టును అనుసరించి పదో తరగతి/ ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి. వయసు 18 నుంచి 34 ఏళ్ళు ఉండాలి.
Advertisement
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేషన్స్ జడ్జి, డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్, మెదక్-502110 చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేదీ:26.11.2022
వెబ్ సైట్:https://districts.ecourts.gov.in/
అలాగే, విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా క్షయ నియంత్రణ కార్యాలయం ఎన్ టిఈపి ప్రోగ్రాం లో భాగంగా ఒప్పంద ప్రాతిపాదికన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు వెబ్ సైట్: https://vizianagaram.ap. in/ ను సంప్రదించాలి.
Read Also : Masooda Movie Review : హారర్ మూవీ “మసూద” రివ్యూ