Advertisement
దగ్గుబాటి ఫ్యామిలీ పేరు చెప్పగానే ది గ్రేట్ నటుడు దగ్గుబాటి వెంకటేష్ మాత్రమే గుర్తుకు వస్తారు. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి రానా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. వీరిద్దరూ దేశవ్యాప్తంగా తెలిసిన హీరోలే కానీ, దగ్గుబాటి ఫ్యామిలీలో మరో వ్యక్తి ఉన్నారు ఆయనే దగ్గుబాటి అభిరామ్. దగ్గుబాటి సురేష్ బాబు రెండో కుమారుడు. ఆయనకు పెళ్లి కుదిరినట్టు తెలుస్తోంది. అయితే ఆయన పెళ్లి చేసుకునేది కూడా వాళ్ళ బంధువుల అమ్మాయి అని నిర్మాత రామానాయుడు తమ్ముడి మనవరాలిని అభిరాం పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. ఆ వివరాలు ఏంటో చూద్దాం..
Advertisement
Advertisement
అభిరామ్ ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒకరికి ఒకరు ఇష్టపడ్డారని, వీరి ప్రేమకు రెండు కుటుంబాలు కూడా అంగీకారం తెలిపాయని, రామానాయుడు కోరిక మేరకే ఈ వివాహం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ అభిరాం పెళ్లి ఇండియాలో జరగడం లేదట, పరాయి దేశమైనటువంటి శ్రీలంకలో గ్రాండ్ గా చేయబోతున్నట్టు తెలుస్తోంది. వీరి పెళ్లి డిసెంబర్ 6న ఫిక్స్ చేశారట. ఈ వివాహం కోసం వివాహ ఆహ్వాన పత్రికలు కూడా చాలా గ్రాండ్ గా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక అభిరామ్ విషయానికి వస్తే అహింస అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు కానీ ఏమాత్రం అకట్టుకోలేకపోయారు. ప్రస్తుతం అభిరామ్ బిజినెస్ లు చేస్తున్నట్టు తెలుస్తోంది.