Advertisement
రేణుక స్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా కన్నడ స్టార్ హీరో దర్శన్ సుమారు మూడు నెలల పాటు జైల్లో గడుపుతున్నారు. కన్నతల్లికి దూరంగా ఉన్న దర్శన్ ఇప్పుడు అమ్మని గుర్తు చేసుకుని ఆవేదన చెందుతున్నారు. భార్యతో ఫోన్లో మాట్లాడిన హీరో దర్శన్ ఒకసారి అమ్మని తీసుకురమ్మని ఎమోషనల్ అయ్యారట. బళ్ళారి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు దర్శనం జైలులో నుంచి తన భార్య విజయలక్ష్మి తో మాట్లాడారని కన్నడ మీడియా తెలిపింది.
Advertisement
భార్య విజయలక్ష్మితో ఐదు నిమిషాలు మాట్లాడిన దర్శన్ తదుపరి న్యాయపోరాటంపై చర్చించారని తెలిసింది. ఆ తర్వాత భార్యతో మాట్లాడుతూ తల్లిని తలుచుకుని ఎమోషనల్ అయ్యారట. జైలుకు వచ్చేటప్పుడు అమ్మను కూడా తీసుకురమ్మని ఆయన చెప్పారు. ఇది ఇలా ఉంటే దర్శన్ కుటుంబ సభ్యులు కూడా ఆయన భార్య పరామర్శకు వచ్చే విషయంపై జైలు అధికారులకు సమాచారం అందించారు.
Advertisement
Also read:
దర్శన్ భార్య విజయలక్ష్మి అతని తల్లి మీనా బుధవారం బళ్లారి సెంట్రల్ జైలుకు వెళ్లి హీరో దర్శన్ తో భేటీ అవుతారని తెలిసింది. జైల్లో దర్శన్ రౌడీ షీటర్ లతో కలిసి కూర్చుని దర్జాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసిన ఫోటోలు బయటకు రావడం కలకలం రేపింది. అధికారులు సిబ్బందిపై తీవ్ర విమర్శలు రావడంతో అతన్ని బళ్ళారి సెంట్రల్ జైలుకు తరలించారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!