Advertisement
ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ లో హైదరాబాద్ తరపున ఆడి.. తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు వార్నర్. అప్పటినుంచి తెలుగు ఫ్యాన్స్ తో పాటు వార్నర్కు ఇండియా వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా ఈ ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, తన రిటైర్మెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే క్రికెట్లో ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని సూచనప్రాయంగా వెల్లడించాడు.
Advertisement
తాజాగా జరిగిన ప్రైవేట్ షోలో వార్నర్ మాట్లాడుతూ, క్రికెట్ నుంచి తప్పుకోవాల్సి వస్తే, మొదటగా అది టెస్ట్ క్రికెట్ అవుతుందని, బహుశా సుదీర్ఘ ఫార్మాట్ లో మరో ఏడాది పాటు కొనసాగుతానని, టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ పై సంకేతాలు ఇచ్చాడు.మరోవైపు వైట్ బాల్ క్రికెట్ లో మాత్రం 2024 టీ 20 వరల్డ్ కప్ వరకు కొనసాగుతానని, పరిమిత ఓవర్ల క్రికెట్ లో కొనసాగే అంశంపై తన ఉద్దేశాన్ని బయట పెట్టాడు. వార్నర్ టెస్టుల్లో మరో ఏడాది కొనసాగితే, ఈ మధ్యలో భారత్ తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, ఇంగ్లాండ్ తో యాషెస్ సిరీస్ లకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
Advertisement
కాగా, 36 ఏళ్ల వార్నర్, తాజాగా స్వదేశంలో జరిగిన టి20 వరల్డ్ కప్ లో ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. అతనితో పాటు అతను ప్రాతినిధ్యం వహించే డిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా కూడా పేలవ ప్రదర్శన కనబరిచి, గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి వైదొలిగింది. కాగా, గత దశాబ్ద కాలంగా ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్న వార్నర్, 96 టెస్టులు, 138 వన్డేలు, 99 టి20 లో ఆడి, దాదాపు 17000 పరుగులు సాధించాడు.
Read Also : BCCI కొత్త రూల్.. టీ20 జట్టు నుంచి సూర్య ఔట్..?