Advertisement
ఒక్కోసారి కలలో చనిపోయిన వాళ్ళు కనబడుతుంటారు. కలలో చనిపోయిన వాళ్ళు కనబడితే మంచిదా కాదా అని దాని గురించి చాలా మంది సందేహ పడుతుంటారు. దాని వెనుక సమాధానం చూద్దాం. సైన్స్ ప్రకారం నిద్రలో ఉన్న టైంలో మెదడు మరింత చురుకుగా పనిచేస్తుంది. రాత్రి పూట కలలు రావడానికి ఇదే కారణం. కలలో వచ్చే ప్రతి అంశానికి ఏదో ఒక కారణం ఉంటుందని పండితులు అంటున్నారు. రాత్రి పడుకునే సమయంలో చనిపోయిన తల్లిదండ్రులు కనబడితే దానికి సంకేతం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
సైన్స్ ప్రకారం గాఢ నిద్రలో ఉన్న సమయంలో మెదడు పనితీరు మరింత చురుకుగా ఉండటం వలన కలలు రావడం సహజం. చనిపోయిన తల్లి లేదా తండ్రి కలలో కనపడితే వారి ఏదో కోరిక ఉందని అర్థం చేసుకోవాలి. వారికి చివరి కోరిక ఏదైనా తీరకపోయినా ఇలా కనబడుతూ ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. కలలో వాళ్ళు కనిపించిన ఒక్కో విధానానికి ఒక్కో అర్థం ఉంటుందట. తల్లిదండ్రులు ఏడుస్తున్నట్లు కనపడితే అశుభంగా భావించాలి. భవిష్యత్తులో ఏదో ఒక శుభవార్త వింటారని దానికి అర్థం.
Advertisement
Also read:
అలానే కలలో చనిపోయిన తల్లిదండ్రులు నవ్వుతున్నట్లు సంతోషంగా ఉన్నట్లు కనపడితే మంచి సూచనగా భావించాలి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి మీ ఎదుగుదల పట్ల వాళ్లు సంతోషంగా ఉన్నారని వచ్చే రోజుల్లో ఏదో శుభవార్త వింటారని భావించాలి. జీవితంలో పురోగతి పొందే అవకాశాలు కూడా ఉంటాయట చనిపోయిన తల్లిదండ్రులతో మీరు మాట్లాడుతున్నట్లు కనుక కల వస్తే అది కూడా మంచిగానే భావించాలి. ఏదైనా శుభవార్తను మీరు వింటారు అని దానికి అర్థం.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!