Advertisement
సికింద్రాబాద్.. రాంగోపాల్ పేట ఏరియా. రోజూలాగే జనం ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఉద్యోగస్తులు ఆఫీసులకు పయనం అయ్యారు. మిగిలనవాళ్లు వాళ్ల వాళ్ల పనుల్లో ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలోనే ఐదు అంతస్తుల భవనంలో మంటలు మొదలు అయ్యాయి. ముందు సెల్లార్ లోని గోదాంలో పొగలు వ్యాపించాయి. క్రమ క్రమంగా అవి ఒక్కో ఫ్లోర్ కు వ్యాపించాయి.
Advertisement
అయిదు అంతస్తుల భవనం, పెంట్ హౌజ్ లో డెక్కన్ నైట్ వేర్ పేరిట స్పెర్ట్స్ సామాగ్రి, బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు. ఓవైపు మంటలు విపరీతంగా వ్యాపిస్తున్నాయి. ఫైర్ సిబ్బంది స్పాట్ కి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు చూశారు. అయితే.. ట్యాంక్ లో నీళ్లు అయిపోతున్నాయి గానీ.. మంటలు మాత్రం తగ్గడం లేదు. దీంతో మరికొన్ని ఫైరింజన్లను పిలిపించారు.
Advertisement
క్రమక్రమంగా భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. అంతకంతకూ పెరగడంతో సహాయక చర్యలకు విఘాతం ఏర్పడింది. భవనం లోపల నుంచి పేలుడు శబ్ధాలు రావటంతో అధికారులు అప్రమత్తమై.. చుట్టుపక్కల ఇళ్ల నుంచి గ్యాస్ సిలిండర్లను తరలించారు. తర్వాత భవనం పక్కనున్న కాచీబౌలి కాలనీతో పాటు మరిన్ని ప్రాంతాల్లోని ఖాళీ చేయించారు.
పొగ కారణంగా చిన్నారులు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరయ్యారు. పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దాదాపు 8 గంటలపాటు శ్రమించి చివరకు అదుపులోకి తెచ్చారు ఫైర్ సిబ్బంది. ప్రమాదం విషయం తెలిసి హోంమంత్రి మహమూద్ అలీ అక్కడకు వెళ్లారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటు సంబంధింత అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ వచ్చారు. అయితే.. మంటల ధాటికి భవనం కూలిపోయే పరిస్థితికి వచ్చిందని అంటున్నారు.