Advertisement
ఢిల్లీ లిక్కర్ కేసులో గంట గంటకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రేపు ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఈ తరుణంలోనే అరుణ్ రామచంద్ర పిళ్ళై ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిళ్ళై అరెస్ట్ అయ్యారు. ఆయన నేడు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఉపసంహరించు కోవడానికి అవకాశాన్ని ఇవ్వాలంటూ ఢిల్లీలోని హౌస్ అవెన్యూ కోర్టు లో దరఖాస్తు చేశారు.
Advertisement
also read: Apollo Fish in Telugu: అపోలో ఫిష్ తినడం వల్ల కలిగే ఉపయోగాలు, అనర్ధాలు ఏంటో తెలుసా..?
పిళ్ళై దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈడికి నోటీసులు పంపింది. వాస్తవానికి రామచంద్ర పిళ్ళై ఇచ్చిన వాంగ్మూలం తోనే కవితను ఈడి రేపు విచారించనుంది. ఆమెను 9వ తేదీన విచారించాల్సి ఉంది. కానీ ఆమెకు ముందస్తుగా ఖరారు అయినా షెడ్యూల్ విచారణకు హాజరు కాలేకపోతున్నానని,11న హాజరవుతానని ఈడీ కి తెలియజేసింది. ఈ తరుణంలోనే పిళ్ళై ట్విస్టు ఇవ్వడం చాలా ఆసక్తికరంగా మారింది.
Advertisement
also read: “అమ్మా ఇంకోసారి ఏడిస్తే మాత్రం గుడ్ బై చెబుతాను”.. అంటూ తారకరత్న కూతురు ఎమోషనల్ పోస్ట్..!!
అయితే ఇప్పటికే పిళ్లై తన వాంగ్మూలంలో తాను కవిత బినామినని ఆమె చెప్పినందునే తన ఖాతాలోకి 32 కోట్లు వచ్చి పడ్డాయని ఈడీకి తెలియజేశాడు. అలాగే ఒక కోటి రూపాయలు సైతం తన సొంత అకౌంట్లోకి పడ్డాయని అన్నారు. ఏది ఏమైనా రేపు కవితను అరుణ్ రామచంద్ర పిళ్ళై సమక్షంలోనే విచారించనున్నారు. కాబట్టి అవన్నీ తాను చెప్పలేదని ఆ మేరకే కోర్టులో పిటిషన్ కూడా వేసే అవకాశం ఉందని పిళ్ళై చెప్పే అవకాశం ఉంది. మరి రేపు ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.
also read: పవిత్ర లోకేష్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!