Advertisement
వివాహేతర సంబంధాల వలన దేనికైనా తెగిస్తున్నారు. ఎంత దారుణానికైనా పాల్పడుతున్నారు. ఇటువంటివి తరచు మనకి వార్తల్లో కనబడుతూనే ఉంటాయి. పిల్లలు ఉన్నా కూడా లెక్క చేయటం లేదు. కట్టుకున్న భర్త ని ముంచేసి ప్రియుడి కోసం వెళ్ళిపోతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలో ఇది జరిగింది.
Advertisement
వివరాల్లోకి వెళితే.. పూజ కుమారి అనే మహిళకి 2019లో జితేంద్ర అనే అతనితో పెళ్లయింది. అప్పటికే జితేంద్ర కి పెళ్లి అయ్యి బాబు ఉన్నాడు. వాళ్లని వదిలేసి పూజ కుమారితో ఉంటున్నాడు జితేంద్ర. అంతా బాగానే వుంది కానీ కొన్ని ఏళ్ల తర్వాత పూజకి జితేంద్ర కి మధ్య గొడవలు వచ్చాయి. తిరిగి భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు జితేంద్ర.
Advertisement
ఇక అతని మీద కోపం పెంచుకున్న పూజ అతని అడ్రస్ కనుక్కొని ఈ నెల పదిని జితేంద్ర ఇంటికి వెళ్ళింది. తలుపులు తీసి ఉండడంతో నేరుగా లోపలికి వెళ్ళింది. జితేంద్ర కొడుకు మంచం పై పడుకుని ఉన్నాడు. అయితే జితేంద్ర కనపడ లేదని కోపంతో బాబుని చంపేసి అక్కడ ఉన్న పెట్టెలో నుండి బట్టలు బయటకు తీసేసి మృతదేహాన్ని అందులో పెట్టి వెళ్ళిపోయింది. పోలీసులు అక్కడ ఉన్న సిసిటీవీ ఫుటేజ్ ని చూసి పూజ ని అరెస్ట్ చేశారు.
Also read:
- ఈ మ్యూజిక్ డైరక్టర్ల వలనే.. వాళ్ళు అవకాశాల్ని కోల్పోయారు..!
- 10 ఏళ్ల క్రితం పెళ్లయింది..2 పిల్లలు..అలాంటి పని చేయడానికి మనసెలా వచ్చిందో..!!
- ఆయనకు 30, ఆమెకు 42..ఎర్రగా ఉందని ఆశపడ్డాడు..గూగుల్ లో సెర్చ్ చేసి మరీ అలా చేశాడు..!!