Advertisement
దేశంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కి డిమాండ్ ఎంతలా ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆన్లైన్ డెలివరీ సంస్థల్లో పని చేసే చాలా మంది డబ్బులు సంపాదించుకుంటున్నారు పార్ట్ టైం జాబ్ కింద ఫుల్ టైం జాబ్ కింద చాలామంది డబ్బులు సంపాదించుకుంటున్నారు. చాలామంది నిరుద్యోగులకు అవకాశాన్ని కల్పిస్తున్నారు. స్విగ్గి జొమాటో వంటి రకరకాల కంపెనీలో ఫుడ్ డెలివరీ బాయ్స్ గా చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు అలా ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఫుడ్ డెలివరీ ఉద్యోగం మీద ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది తప్ప మరో ఆర్థిక సహాయం వాళ్లకి ఉండదు.
Advertisement
తాజాగా జొమాటో ఫుడ్ డెలివరీ ఉద్యోగాన్ని నమ్ముకునే జీవనాన్ని సాగిస్తున్న ఒక యువకుడు కి సంస్థ షాక్ అయితే ఇచ్చింది జోమాటో సంస్థ చేసిన పనికి యువకుడు సోషల్ మీడియా వేదిక ద్వారా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. కొన్ని సాంకేతిక సమస్యల కారణాల వలన డెలివరీ బాయ్స్ అకౌంట్ లని సంస్థ బ్లాక్ చేస్తుంది అలా ఐకాన్ బ్లాక్ చేసినప్పుడు డెలివరీ బాయ్స్ కి ఎటువంటి ఆర్డర్స్ కూడా తీసుకోవడానికి అవ్వదు.
Advertisement
Also read:
- సొంత జెట్ విమానాలు కలిగి ఉన్న తెలుగు హీరోలు..!!
- Tollywood heroes: ఫస్ట్ హాఫ్ వరకు డైలాగులు లేకుండా నటించిన.. ముగ్గురు హీరోలు వీళ్ళే..!
- ముగ్గురు అక్కాచెల్లెళ్లతో నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?
డెలివరీ బాయ్ కి కొత్త ఐడిని క్రియేట్ చేయాలి అలానే ఐడి యాక్టివ్ అయ్యేంత దాకా ఎదురు చూడాలి. సంస్థ ఐడి యాక్టివ్ చేయడం అనేది చాలా కష్టం. ఈ కారణంగా డెలివరీ బాయ్ ఖాతాని జొమాటో బ్లాక్ చేసింది, ఈ విషయం గురించి ఏడుస్తూ బాధపడుతున్నాడు ఆ యువకుడు. కొన్ని రోజుల్లో తన చెల్లి పెళ్లి కూడా ఉందట ఖాతాని బ్లాక్ చేయడంతో బాధపడుతున్నాడు. ఏం చేయాలో తెలీక ఢిల్లీలోని దగ్గర రోడ్డు మీద ఏడుస్తూ కనిపించాడని తెలుస్తోంది అతని ఐడి ని జొమాటో సంస్థ త్వరగా యాక్టివ్ చెయ్యాలని కోరాడు దీనిపై చాలామంది నెటిజెన్స్ స్పందిస్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!