Advertisement
హిందూ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం కొబ్బరికాయకు చాలా ప్రాముఖ్యత ఉంది. దాదాపు అన్ని శుభకార్యాలకు కొబ్బరికాయను కొట్టి దేవుడిని పూజిస్తారు. మన పెద్దవారు ఇలా కొబ్బరికాయను కొట్టడాన్ని ఆత్మ సమర్పణ తో భావిస్తారు. అటువంటి కొబ్బరికాయను కొట్టేటప్పుడు అది పగిలే విధానాన్ని బట్టి మన భవిష్యత్ తెలుస్తుంది అని పండితులు చెబుతున్నారు. ఒకవేళ కొబ్బరికాయ కొట్టినప్పుడు అది సమానంగా పగిలితే మనసులోని ధర్మబద్దమైన కోరిక త్వరగా నెరవేరడానికి సూచిక అని చెబుతుంటారు.
Advertisement
Advertisement
కొత్తగా వివాహమైన దంపతులు కొబ్బరికాయను కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే అది సంతాన యోగాన్ని సూచిస్తుందట. అలాగే ఒక్కొక్కసారి కొబ్బరికాయను కొట్టినప్పుడు వంకరటింకరగా పగులుతుంటుంది. ఒకవేళ కొబ్బరికాయ అలా పగిలితే మనం మానసిక ఆందోళనతో ఉన్నామని అర్థమట. ఒకవేళ కొబ్బరికాయ నిట్ట నిలువుగా పగిలితే ఆ ఇంట్లో సంతానం కలుగుతుందని అర్థం. అలాగే అప్పుడప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోతూ ఉంటుంది.
అలా జరిగినప్పుడు చాలా మంది భయపడుతూ ఉంటారు. కొబ్బరికాయ అలా కుళ్ళి పోయిందేంటని ఆందోళన చెందుతుంటారు. కానీ కొబ్బరికాయ కుళ్ళిపోతే అది అనర్ధమేమి కాదట. అలాగే వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే దిష్టి పోయినట్టే అని పండితులు చెబుతున్నారు. మనం భక్తితో తెచ్చిన పండైనా, ఆకైనా, పువ్వైనా, నీరైనా భగవంతుడు చాలా ప్రేమతో స్వీకరిస్తాడు. ఒకవేళ కొబ్బరికాయ చెడిపోయిన సరే ఆ స్వామి ప్రేమతో స్వీకరిస్తాడు తప్పా తన దగ్గరకు వచ్చిన భక్తులను మాత్రం ఇబ్బందులకు గురి చేయడు.