Advertisement
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిజానికి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్నంతమంది కమెడియన్స్ మరే ఇండస్ట్రీలో ఉండరు. ఒక్కొక్క కమెడియన్ ది ఒక్కో స్టైల్. ఇలా కమెడియన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో, లెక్చరర్ పాత్రలలో నటించి తన కామెడీ ద్వారా ఎంతో మంది ప్రేక్షకుల మొహాలపై చిరునవ్వు తెప్పించిన నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన సినీ అభిమానులకు దూరమై పదేళ్లు కావస్తుంది. అయినా ఆయన నటన, హాస్యం ఇప్పటికీ ప్రేక్షకుల మథిలో చెరగని ముద్ర వేశాయి. 1954లో జన్మించిన ఆయన 2013లో కాలేయ క్యాన్సర్ తో కన్నుమూశారు.
Advertisement
తాజాగా ఆయన గురించి ధర్మవరపు కుమారుడు రవి బ్రహ్మ తేజ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ” మేము చాలా సంతోషంగా గడుపుతున్నామంటే అందుకు గల కారణం నాన్న చిన్నప్పటినుండి ఏ కష్టం తెలియకుండా మమ్మల్ని పెంచారు. 2001లో “నువ్వు నేను” సక్సెస్ పార్టీ కి వెళ్లి వస్తున్న సమయంలో ఆయనకు యాక్సిడెంట్ జరిగింది. బస్సు నాన్న కారు మీదకి ఎక్కడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. అక్కడ ఉన్నవారు వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లడంతో బతికారు. తలపై 21 కుట్లు, కుడి చేతికి సర్జరీ చేసి రాడ్స్ వేశారు. ఈ ప్రమాదం నుంచి కోలుకున్న తరువాత నాన్న తిరిగి సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. ఇక ఉన్నట్టుండి 2005వ సంవత్సరంలో అనారోగ్యానికి గురయ్యారు.
Advertisement
ఆయన సిగరెట్స్ ఎక్కువగా తాగడం వల్ల లంగ్స్ పూర్తిగా పాడయ్యాయని డాక్టర్లు తెలిపారు. అప్పుడు పది రోజులపాటు కోమాలో ఉన్నారు. అలా నాన్నను రెండుసార్లు కాపాడుకున్నాం. కానీ మూడోసారి కాపాడుకోలేకపోయాం. 2012 దీపావళి తర్వాత ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. లివర్ క్యాన్సర్ నాలుగో స్టేజ్ అని చెప్పారు. 11 నెలల కంటే ఎక్కువ బతకరని చెప్పారు. నాన్న కూడా తనకు మరణం తధ్యమని భావించారు. ఆ సమయంలో నాన్నని చూడడానికి బ్రహ్మానందం గారు ఇంటికి వస్తానని అంటే నాన్న ఒప్పుకోలేదు. నన్ను చూసి తట్టుకోలేవు, ఆరు నెలల తర్వాత నేనే వస్తా.. మళ్లీ షూటింగ్ చేద్దాం అన్నారు. కానీ అంతలోనే 2013 డిసెంబర్ 7వ తేదీన ఆయన చనిపోయారు. నాన్న మరణించిన తర్వాత బ్రహ్మానందం గారు చూడడానికి ఇంటికి రాలేదు. కానీ ఫిలిం ఛాంబర్ లో నాన్నని తలుచుకొని చాలా ఏడ్చారు” అని చెప్పుకొచ్చారు రవి బ్రహ్మ తేజ.
Read also: అతిధుల సాక్షిగా పెళ్లి మండపం లో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఇద్దరు ఫైటింగ్ కారణం ఏంటంటే ?