Advertisement
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అనుబంధం ఉంది. 2008లో IPL ప్రారంభమైంది. అప్పటి నుంచి 2023 వరకు మహేంద్ర సింగ్ ధోని నాయకత్వం వహించారు. ఐదుసార్లు విజేతగా నిలిచేలా చేశారు అప్పట్లో చెన్నై జట్టుపై ఆరోపణలు రాకుంటే మరిన్ని ట్రోఫీలను అందించేవారు. చెన్నై జట్టుకు తిరుగులేని విషయాలు అందించిన నేపథ్యంలో ధోనిని ఆ జట్టు అభిమానులు అన్నా అని పిలవడం మొదలుపెట్టారు. 2023లో చెన్నై జట్టుని విజేతగా నిలపడంతో ధోని తీవ్రంగా కృషి చేశాడు.
Advertisement
గుజరాత్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శనతో పాటుగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వచ్చాడు. ఫలితంగా చెన్నై జట్టు విజేతగా నిలిచింది. 2024 సీజన్లో షాక్ ఇచ్చాడు. టోర్నీ రేపు ప్రారంభమవుతుంది అనగా బెంగళూరు జట్టుతో జరిగే మ్యాచ్లో కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్నారు ఆ స్థానాన్ని రుతురాజ్ గైక్వాడ్ భర్తీ చేశారు 2024 లో చెన్నై జట్టు ఆశించినంత స్థాయిలో ప్రదర్శించలేకపోయింది. 2024లో కెప్టెన్సీకి గుడ్ బాయ్ చెప్పేశారు ధోని.
Advertisement
Also read:
ఈ సీజన్ లో తక్కువ ధరకే ధోనీ పలికే అవకాశం ఉందని గత కొద్ది రోజుల నుంచి స్పోర్ట్స్ వర్గాల్లో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ధోని రిటైర్మెంట్ పై కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. దీంతో అభిమానులు ఒకసారిగా ఆందోళనకు గురవుతున్నారు చెన్నై అభిమానులకు చెన్నై జట్టుకు బీసీసీఐ శుభవార్త చెప్పిందని జాతీయ మీడియా ఒక కథనాన్ని ప్రసారం చేసింది. దాని ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించి 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆటగాళ్లను అన్ క్యాపిటల్ ప్లేయర్ గా గుర్తించి నిబంధనకు బీసీసీ అనుమతి ఇచ్చిందని తెలిపింది. ఒకవేళ కనుక ఇది నిజమైతే తక్కువ ధరకు ధోనిని చెన్నై సొంతం చేసుకునే అవకాశం ఉంది.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం మీరు చూడండి!