Advertisement
బీసీసీఐ అధ్యక్ష బాధ్యతల నుంచి సౌరవ్ గంగూలీ త్వరలోనే తప్పుకోబోతున్నాడు. 2019లో బీసీసీఐ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన దాదా, ఈ మూడేళ్లలో బోర్డు కార్యకలాపాల్లో తన మార్కు చూపించాడు. లోదా కమిటీ సంస్కరణల అమలుపై తర్జన బర్జనను అడుతూ గాడి తప్పిన బీసీసీఐ ని గంగూలీ గాడిలో పెట్టాడు. అయితే అతను రెండో పర్యాయం కూడా బీసీసీఐ ప్రెసిడెంట్ గా కొనసాగేందుకు ఆసక్తి కనబరిచాడు.
Advertisement
READ ALSO : ‘ఆచార్య’ అట్టర్ ఫ్లాఫ్.. చిరంజీవి, రామ్ చరణ్ షాకింగ్ నిర్ణయం
కానీ, బోర్డు సభ్యులు మాత్రం అతనికి మద్దతుగా నిలవలేదు. గంగూలీ పదవి పోవడానికి అనేక కారణాలు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో, టీం సెలక్షన్ లో అతి జోక్యం, బోర్డులో దాదాగిరి సభ్యులకు నచ్చలేదని, దాంతో రెండోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగేందుకు నిరాకరించాలని ప్రముఖ వెబ్ సైట్ తాజాగా పేర్కొంది. తాజాగా సౌరవ్ గంగూలీ పదవి తొలగింపు వెనుక ధోని హస్తం కూడా ఉందనే ప్రచారం ఊపందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్, మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ద్వారా గంగూలీ కి ధోని చెక్ పెట్టాడనేది ఆ వార్తల సారాంశం. బీసీసీఐ కి అధ్యక్షుడిగా పనిచేసిన ఎన్ శ్రీనివాసన్, సౌరవ్ గంగూలీ పనితనం విషయంలో విమర్శలు గుప్పించారట. అతని స్థానంలో రోజర్ బిన్నీని బీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందని బీసీసీఐ సమావేశంలో గట్టిగా వాధించారట. సి ఎస్ కే బాస్ ఏం చేసినా దాని వెనక మహేంద్రసింగ్ ధోని ప్రమేయం ఉంటుందనేది చాలామందికి తెలిసిన విషయమే. ధోని సూచనలతో సి ఎస్ కే బాసు గంగూలీకి వ్యతిరేకంగా మాట్లాడాడంట.
Advertisement
మరి ధోనీకి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై ఎందుకు ఇంత కక్ష? ఎందుకో అనే విషయం అర్థం అవడం లేదు. బీసీసీఐ బాస్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే గంగూలీ, ధోనీకి చెక్ పెట్టాడు. టీం భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయం తీసుకోవాలని చెప్పాడు. దాంతో మరో గత్యంతరం లేక ధోని అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఇక భారత జట్టుకు మూడు ఐసీసీ టైటిల్లు అందించిన ధోనీకి బీసీసీఐ కనీసం వీడ్కోలు మ్యాచ్ కూడా ఏర్పాటు చేయలేదు. కనీసం ఆ దిశగా ప్రయత్నం కూడా చేయలేదు. ఈ విషయంలో బీసీసీఐ పై ధోని ఫ్యాన్స్ కూడా ఆగ్రహంగా ఉన్నారు. అయితే, ఈ సంఘటనలు తేరపైకి తెస్తూ, గంగూలీ పదవి తొలగింపు వెనుక ధోని హస్తం కూడా ఉందని వార్తలు గుప్పుమంటున్నాయి.
Read also : సమంత మళ్ళీ ప్రేమలో పడిందా?