Advertisement
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు హోరెత్తిపోయాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్లు కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సినీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలతో నిండిపోయింది. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పారు. ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో కూడా గెలవాలని కోరుకుంటున్నాను అని బన్నీ సింపుల్ గా ట్వీట్ చేశారు.
Advertisement
గెలిచిన తర్వాత కూడా అంతే సింపుల్ గా ట్వీట్ చేశారు. అంతకుమించి ఒక మాట కూడా మాట్లాడలేదు. అల్లు అరవింద్ కూడా పిఠాపురం వెళ్లి ప్రచారం చేశారు, అల్లు అర్జున్ మాత్రం నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. అప్పటినుంచి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులతో అల్లు అర్జున్ కి దూరం పెరిగిపోయింది. కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
Advertisement
Also read
ఆయన పుట్టినరోజుకి కూడా హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటూ ట్వీట్ చేశారు. బన్నీకి పవన్ కళ్యాణ్ చిన్న మామయ్య అవుతాడు. సంబంధం బాగున్న రోజుల్లో ఏనాడు పవన్ కళ్యాణ్ గారు అని అల్లు అర్జున్ పిలవలేదు. ఇప్పుడు దూరం పెరిగిపోయింది. అందుకే ఇలా పోస్ట్ చేసాడని అంతా అభిప్రాయపడుతున్నారు మరి మెగా అల్లు ఫ్యామిలీ మధ్య ఏం జరుగుతుందనేది పూర్తిగా మనకి తెలియదు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!