Advertisement
చిన్నప్పుడు మనం చూసిన సినిమాలను ఇప్పటికీ మరిచిపోలేము. ఎందుకు అంటే ఆ సినిమాలు ప్రేక్షకుల మదిలో ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటుంటాయి. ఇప్పుడు ఆ సినిమాలు విడుదలైన కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా ప్రతీ ఒక్కరూ వీక్షిస్తుంటారనే చెప్పవచ్చు. ఇలాంటి సినిమాల్లో నందమూరి నటసింహం బాలయ్య బాబు నటించిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఆదిత్య 369, బైరవద్వీపం వంటి సినిమాలు బాలయ్య కెరీర్ లో నే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.
Advertisement
అప్పట్లో ఈ సినిమాలు వసూళ్లతో ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాయి. నిర్మాతలకు కూడా భారీగానే లాభాలను తెచ్చిపెట్టాయి. ప్రతీ ప్రేక్షకుడి మదిలో చెరగని ముద్ర వేసుకున్నాయి. ముఖ్యంగా బాలయ్య కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నప్పటికీ బైరవద్వీపం వంటి క్లాసిక్ హిట్ మూవీ మాత్రం ఇప్పటివరకు మళ్లీ తీయలేదు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కిందనే విషయం తెలిసిందే. అప్పట్లో కాస్త ఫ్యూచర్ విజన్ తో ఆలోచించిన సింగీతం శ్రీనివాసరావు తన సినిమాలతో మంచి సక్సెస్ సాధించారు.
Advertisement
బైరవద్వీపం సినిమాతో బాలయ్యకి మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. ఈ మూవీ అప్పట్లోనే రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టిందట. కేవలం రూ.5కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ రన్ లో దాదాపు రూ.19కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను రాబట్టిందట. దీనిని బట్టి చూస్తే.. ఆ రోజుల్లోనే ఈ సినిమాని జనాలు ఎంతలా ఎగబడి చూశారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి దర్శకులు అయితే బైరవద్వీపం వంటి సినిమాలో తెరకెక్కించడం కాస్త అసాధ్యం అనే అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా భైరవద్వీపం మూవీలో నరుడా ఓ నరుడా అనే పాటని ఇప్పటికీ ఎంతో ఇష్టంగా వింటూనే ఉన్నారు. ముఖ్యంగా భైరవద్వీపం సినిమాలో నరుడా ఓ నరుడా అనే పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఆరేళ్ళ పిల్లాడి టైమ్ టేబుల్ వైరల్.. చూసారంటే అస్సలు నవ్వు ఆపుకోలేరు..!
బాలకృష్ణ లెజెండ్ సినిమాలో జగపతి బాబు క్యారెక్టర్ ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా ?
కళ్యాణ్ రామ్ భార్య గురించి మీకు ఈ రహస్యాలు.. వామ్మో ఆమె ఇలా చేసిందా..?