Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. ఈ రోజున మెగా ఫ్యామిలీ నుంచి ఇంతమంది హీరోలు వచ్చారు అంటే దానికి ప్రధాన కారకుడు మెగాస్టార్ అని చెప్పుకోవచ్చు. అలాంటి చిరంజీవి సినిమాల ద్వారా భారీగానే ఆస్తులు సంపాదించారు. కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా రికార్డ్ క్రియేట్ చేసిన హీరో చిరంజీవి మాత్రమే. అలా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోగా కొనసాగిన మెగాస్టార్ కొన్ని ఏళ్లు గ్యాప్ ఇచ్చి మళ్లీ రీఎంట్రీతో అదరగొట్టారు.
Advertisement
ప్రస్తుతం సినిమా సినిమాకి వందల కోట్ల కలెక్షన్లు సాధిస్తున్నారు. ఈ విధంగా చిరంజీవి తన కెరీయర్లో ఎన్నో కోట్లాది రూపాయల సంపాదన పోగేసుకున్నారు. హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, చెన్నై, విజయవాడ నగరాల్లో భారీగా భవనాలు స్థిరాస్తులు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ రాకముందు చెన్నైలో ఉండగా అక్కడ కూడా చిరంజీవి బాగానే ఆస్తులు సంపాదించారు. ప్రస్తుతం హైదరాబాదులో కూడా విలాసవంతమైన ఫామ్హౌజులు, రియల్ ఎస్టేట్ రంగంలో చిరంజీవి బాగానే పెట్టుబడులు కూడా పెట్టారు. ప్రస్తుతం చిరంజీవి ఒక్క సినిమాకి 25 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయల వరకు పారితోషకం తీసుకుంటున్నారు.
Advertisement
అయితే 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి పాలకొల్లు మరియు తిరుపతి అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ టైంలో ఆయన తన పేరుపై 33 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్లో పొందుపరిచారు. ఇందులో 30 కోట్ల స్థిరాస్తులు, మూడు కోట్ల చరాస్తులు ఉన్నాయని తెలియజేశారు. ఇక తన భార్యపై ఆరు కోట్ల రూపాయల ఆస్తి ఉందని పేర్కొన్నారు. అయితే మార్కెట్ వాల్యూ ప్రకారం 1000 కోట్లకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడే కాకుండా చిరంజీవి తమిళ్నాడు రాష్ట్రంలో కూడా బాగానే ఆస్తులు సంపాదించారని సమాచారం.