Advertisement
ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ళలా ఉండేవారు. వీరి తరం తర్వాత ఇండస్ట్రీకి అంతగా పేరు తీసుకువచ్చింది చిరంజీవి, బాలకృష్ణ అని చెప్పవచ్చు. ఈ ఇద్దరు హీరోలకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. వీరిద్దరూ గ్యాప్ తీసుకొని మళ్ళీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత మరోసారి సినిమాల్లో పోటీపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిత్రాలు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి తీవ్ర ఉత్కంఠ మధ్య రెండు సూపర్ హిట్ అయ్యాయి.
Advertisement
ఈ మధ్యకాలంలో బాలకృష్ణ, చిరంజీవి గురించి వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు. అయితే అశ్వినీ దత్ ఎన్టీఆర్ చిరంజీవిలతో చాలా సినిమాలు చేశారు. ఇంద్ర, చూడాలని ఉంది, జగదేకవీరుడు, అతిలోకసుందరి లాంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలు చేశారు. అలాగే బాలకృష్ణతో అశ్వమేధం చిత్రాన్ని చేశారు. అయితే ఓ రోజు చిత్ర షూటింగ్ విరామంలో ఎన్టీఆర్ అల్లు రామలింగయ్య ముచ్చటించుకోగా వారిద్దరి మధ్య వచ్చిన చర్చని తాజాగా అశ్వినిదత్ చెప్పుకొచ్చారు .
Advertisement
వారిద్దరూ మాట్లాడుతూ చిరు నటించిన ఖైదీ, అడవి దొంగ, పసివాడి ప్రాణం లాంటి సినిమాలు, అలాగే బాలకృష్ణ నటించిన మంగమ్మగారి మనవడు, అనసూయమ్మ గారి అల్లుడు,మువ్వా గోపాలుడు, లాంటి సినిమాల విజయాల గురించి చర్చకు రాగా , సినిమా పరిశ్రమ మీ అల్లుడు చిరంజీవి, మా కొడుకు బాలకృష్ణదే అని ఎన్టీఆర్ అల్లు రామలింగయ్యతో తరచు అనేవారని , వారు చెప్పుకున్నట్టుగానే వీరిద్దరూ రాను రాను సినిమా ఇండస్ట్రీని ఏలే స్థాయికి చేరుకున్నారని అశ్వినిదత్ తెలియజేశారు. ఆరు పదుల వయసులో కూడా ఇద్దరు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఉండడం విశేషం.
also read: