Advertisement
ఇండియాస్ ఫైనెస్ట్ డైరెక్టర్లలో ఒకరైన మణిరత్నం నుంచి వచ్చిన మరో అద్భుతమైన సినిమా ‘పోన్నియిన్ సెల్వన్’. రెండు భాగాలుగా తీసిన ఈ సినిమా మొదటి పార్ట్ పి.ఎస్ 1 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. అయితే తమిళంలో మాత్రం సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మణిరత్నం తీసిన బాహుబలి సినిమా ఇదని తెలుగు ప్రేక్షకులు చెబుతున్నారు.
Advertisement
ఇది ఇలా ఉండగా, ఆల్రెడీ ఓ బాహుబలి ఉంది, ఇంకో బాహుబలి అవసరం లేదు, అంటూ ‘పోన్నియిన్ సెల్వన్’ సినిమా ప్రమోషన్ల సమయంలో వ్యాఖ్యానించాడు. హీరో కార్తీ, అది హైదరాబాద్ లో! అప్పుడలా కార్తీ ఎందుకు అన్నాడో, ఇప్పుడు ‘పోన్నియిన్ సెల్వన్’ సినిమా చూశాక అందరికీ అర్థం అయింది. ‘బాహుబలి’ సినిమాలో కొన్ని సీన్లు, ‘పోన్నియిన్ సెల్వన్’ నుంచి స్ఫూర్తి పొందినవే.
Advertisement
అంటే ‘పోన్నియిన్ సెల్వన్’ సినిమా నుంచి కాదు, ‘పోన్నియిన్ సెల్వన్’ నవల నుంచి! దీనికి సంబంధించి కొన్ని ఆధారాల్ని నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. ‘బాహుబలి’ లో ఆ సీను, ‘పోన్నియిన్ సెల్వన్’ నుంచి ఎలా ఎత్తేసారన్నది తమిళ సిని అభిమానులు పోస్ట్ చేస్తున్న ఫోటోలు, వీడియోల సారాంశం. సినిమా నుంచి కాపీ కొడితే, అది కాపీ అన్నట్టు. కానీ, నవల నుంచి స్ఫూర్తి పొందితే, అది కాపీ ఎలా అవుతుంది? అన్నది ఓ ఇంకో అభిప్రాయం. ఎవరి గోల వారిదే! ఇంకో ‘బాహుబలి’ అవసరం లేదు, అని కార్తీ అన్నాడు కానీ, ‘పోన్నియిన్ సెల్వన్’ సినిమా చూస్తే, అందులో కొన్ని సీన్స్ ‘బాహుబలి’ ని గుర్తుచేస్తాయి.
Read also : నిర్మలమ్మ యుక్త వయస్సు ఫొటోలు వైరల్.. ఎంత బాగుందో!