Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒకప్పుడు తన అంద చందాలతో ఊపేసిన హీరోయిన్ రమ్యకృష్ణ. ఇప్పటికీ ఆమె వయస్సు దాదాపు 55 ఏళ్లు అయినప్పటికీ తరగని అందంతో దూసుకుపోతోంది. రమ్యకృష్ణ భలే మిత్రులు అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. మొదట్లో ఈ ముద్దుగుమ్మ ఐరన్ లెగ్ గా ముద్ర వేసుకుంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా పుంజుకొని ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. మూడు దశాబ్దాలు ఒక ఊపు ఊపేసింది.
Advertisement
Advertisement
ఆ తర్వాత దర్శకుడు కృష్ణవంశీని పెళ్లి చేసుకొని సినిమాలకు కాస్త దూరంగా ఉంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ సీనియర్ నటి తల్లి, వదిన, అక్క పాత్రల్లో దూసుకుపోతోంది. అలాంటి రమ్యకృష్ణ, కృష్ణవంశీని పెళ్లి చేసుకోవడానికి ముందు ఆయనతో ప్రేమలో పడిందట. ఆ వ్యక్తితో చాలా రోజులపాటు సహజీవనం కూడా చేసిందట. రమ్యకృష్ణ మంచి స్టార్ గా ఉన్న సమయంలోనే కృష్ణవంశీతో ప్రేమలో పడింది.
పెళ్లి కాకముందే ఆయనతో సహజీవనం కూడా చేసిందట. దీంతో ఈ విషయం వారి తల్లిదండ్రుల వరకు వెళ్లడంతో వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని వారు డిసైడ్ అయ్యారట. వెంటనే రమ్యకృష్ణ ప్రేమించిన కృష్ణవంశీని వదిలిపెట్టలేక తల్లిదండ్రులను కాదని ప్రేమ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.