Advertisement
టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎనలేని స్టార్డం సంపాదించుకున్నారు హీరో సూర్య. సూర్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తూ ఆయన మార్కెట్ అంతకంతకు పెరుగుతోంది. ఇదంతా పక్కన పెడితే తన ఫ్యామిలీతో తల్లిదండ్రులతో,సోదరుడితో విడిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈయన వాళ్ళను వదిలేసి ముంబైలో సెటిల్ అయ్యారని సమాచారం. దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
Also Read: జవాన్ లో అల్లు అర్జున్ ఉన్నాడా..? క్లారిటీ వచ్చేసింది..!
భిన్నమైన కథలను ఎంచుకుంటున్న సూర్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోంది. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య చిత్రాలను నిర్మిస్తుండగా ఆ సినిమాలు సక్సెస్ సాధిస్తున్నాయి. ప్రస్తుతం సూర్య శివ డైరెక్షన్లో ఒక చిత్రంలో చేస్తుండడం గమనార్హం. వీర్ అనే టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ తర్వాత వేట్రిమోరణ్ డైరెక్షన్లో సూర్య నటిస్తున్నారు.
Advertisement
Also Read: దేవుడి ఉంగరాలు చేతికి దరిస్తున్నారా అయితే ఒక్కసారి ఇవి తెలుసుకోండి !
కట్ చేస్తే 2006లో సూర్య జ్యోతికల పెళ్లి జరిగింది. ఈ జంటకు దియా, దేవ్ పేర్లతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే జ్యోతిక వల్ల తండ్రి సోదరునితో సూర్యకు విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. తమిళ నటుడు బైల్వాన్ రంగనాథన్ ఈ విషయాలను వెల్లడించారు.
సూర్యకు ఆయన తండ్రికి సరిగ్గా సంబంధాలు లేవని,పెళ్లి తర్వాత జ్యోతిక సినిమాలో నటించకూడదని శివకుమార్ కోరారని,ఆమె మాత్రం సినిమాలో నటిస్తుండడంతో తండ్రి కొడుకుల మధ్య గొడవలు వచ్చాయని తెలిపారు. దీనివల్లే సూర్య తన కుటుంబం నుంచి వేరుపడ్డారని బైల్వాన్ రంగనాథన్ పేర్కొన్నారు .
Also Read: టాలీవుడ్ లో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్స్ ! ఎవరు ఎక్కువ అంటే ?