Advertisement
భారతీయ సినీ చరిత్రలో కేజిఎఫ్ సిరీస్ సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమా చిత్రీకరణ ఎంత క్వాలిటీ గా ఉందో విడుదలయ్యాక రెస్పాన్స్ అంతకన్నా సాలిడ్ గా మారింది. ఈ సినిమా దెబ్బకి ఇతర ఇండస్ట్రీలు, ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ కంగుతింది. అక్కడి సినిమాలు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. ఈ సినిమా బడ్జెట్ 150 కోట్ల రూపాయలు కాగా.. కలెక్షన్లు మాత్రం 1500 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. ఈ చిత్రం అటు యష్ కెరీర్ కి, ఇటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కెరీర్ కి ప్లస్ అయింది.
Advertisement
Read also: వేణు స్వామి చెప్పినట్టే నయనతార జీవితంలో సమస్యలు మొదలయ్యాయా..?
Advertisement
ఇప్పుడు ఈ చిత్రం మూడవ పార్ట్ షూటింగ్ కి సంబంధించిన వార్తలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి, తెలుగు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కు సంబంధం ఏమిటి అనేది చాలామందికి అర్థం కాని విషయం. కేజిఎఫ్ సినిమా విడుదలైనప్పుడు ముందుగా కైకాల సత్యనారాయణ సమర్పించు అనే పడుతుంది. ఎందుకంటే కేజిఎఫ్ సిరీస్ సినిమాలకు కైకాల సత్యనారాయణ కొడుకు కైకాల లక్ష్మీనారాయణ సహ నిర్మాతగా వ్యవహరించారు. కేజిఎఫ్ సినిమా రేంజ్ ని ముందుగానే ఊహించిన కైకాల తనయుడు తెలుగులో ఈ చిత్ర రైట్స్ కోసం పోటీపడ్డారు.
అయితే సాయి కొర్రపాటి లాంటి అగ్ర నిర్మాత అండగా ఉంటే మంచి రిలీజ్ వస్తుందని భావించి ఆయనతో కలిసి విడుదల చేశారు. ఈ రెండు సినిమాల ద్వారా కైకాల కుటుంబానికి ఏకంగా 170 కోట్ల రూపాయల నుంచి 180 కోట్ల రూపాయల స్థాయిలో లాభాలు వచ్చాయని సమాచారం. ఈ సినిమా తెలుగు హక్కులను కైకాల లక్ష్మీనారాయణ స్వయంగా చూసుకున్నారు. సాయి కొర్రపాటితో కలిసి తెలుగు రాష్ట్రాలలో విడుదల చేశారు. ఇప్పుడు మూడవ భాగానికి కూడా ఆయనే నిర్మాతగా ఉంటారనే టాక్ నడుస్తుంది.
Read also: ఈ కమెడియన్స్ భార్యలు ఎంత అందంగా ఉన్నారో చూసారా..?