Advertisement
తేనే గురించి మనందరికీ తెలిసిందే. తేనెను ఇష్టపడని వారుండరు. తేనేను టేస్ట్ చేయాలని ఆశపడుతారు. తియ్యగా, టేస్టీగా ఉండే తేనే రుచిలోనే కాదు.. ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. మీకు తియ్యని తేనే గురించి మాత్రమే తెలుసు. మద్యం మాదిరిగానే కిక్కునిచ్చే తేనే గురించి మీకు తెలుసా..?
Advertisement
Advertisement
తేనె కిక్కు ఇవ్వడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? అవును అండి.. ఈ తేనె మందు కంటే ఎక్కువ కిక్కు ఇస్తుంది. ఈ తేనెకి ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఉంది. తేనె మన దేశంలో మాత్రం లభించదు. మన పొరుగు దేశం అయినటువంటి నేపాల్ లో లభిస్తుంది. హిమాలియన్ క్లిప్ తేనెటీగలు ఈతేనెను ఉత్పత్తి చేస్తాయి. తేనెటీగలు విషపూరిత పండ్ల నుంచి తేనెను సేకరిస్తాయి.
ఇది చాలా మత్తుగా ఉంటుంది. చాలా ఔషద గుణాలున్నాయి. ఎర్రని తేనెకు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉండటానికి కారణం. తేనె ప్రయోజనాలను కలిగి ఉంది. మధుమేహం, అధిక రక్తపోటు ఉన్న వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అటు ఆరోగ్య ప్రయోజనాలు.. మద్యం వంటి కిక్కు ఇవ్వడం కారణంగా దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ డిమాండ్ ఉంది.