Advertisement
దర్శకధీరుడు రాజమౌళి ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ గా మంచి పేరును తెచ్చుకున్నారు ఎన్నో అద్భుతమైన సినిమాలని ఆయన తీసుకువచ్చారు. రాజమౌళి బాహుబలి సినిమాని తెర మీదకి తీసుకొచ్చి మంచి స్టార్ దర్శకుడుగా పేరు పొందారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో అయితే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది రాజమౌళికి/ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఇద్దరు స్టార్ హీరోలని ఒకే తెర మీద చూపించారు. ప్రేక్షకులు దీనిని ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నారు వీళ్ళ పాత్రలు కూడా ప్రేక్షకులకి ఎంతగానో నచ్చాయి.
Advertisement
ఇద్దరు స్టార్ హీరోలకి కూడా పాత్ర సరిగ్గా సరిపోయేటట్టు చూశారు రాజమౌళి. ఒకరి ప్రాముఖ్యత పెరిగి ఇంకొకరి ప్రాముఖ్యత తగ్గితే సినిమా బాగోదు పైగా హీరో అభిమానులు కూడా నిరాశ చెందుతారు. ఇద్దరికీ సమానమైన పాత్రని కల్పించి తెర మీద చక్కగా చూపించారు రాజమౌళి దీంతో ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది కూడా. ఈ ఇద్దరు హీరోలు మధ్య సీన్స్ కూడా అందరికీ బాగా కనెక్ట్ అయ్యాయి.
Advertisement
వీళ్ళిద్దరూ మొదటిసారి కలుసుకునే సీన్ అయితే అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. వీళ్ళేదో పెద్ద హీరోలు అని కాకుండా ఆ పాత్రలో మనం లీనం అయిపోయినట్లు చూపించారు. వీళ్ళిద్దరి మధ్య ఉండే సన్నివేశాలు ప్రేక్షకులకి ఆసక్తిని పెంచేసాయి. అయితే కొమరం భీం పాత్ర పోషించిన జూనియర్ ఎన్టీఆర్ మాంసాన్ని తీసుకొని వెళుతూ ఉంటాడు దోస్తీ పాటలో. అప్పుడు అక్కడి నుండి రామరాజు భీం ని చూస్తాడు. భీం ఏమో మాంసాన్ని తీసుకెళ్లి రాహుల్ రామకృష్ణ కి ఇచ్చేస్తాడు.
ఒక రంధ్రంలో నుండి అతను మాంసాన్ని పడేస్తాడు అప్పుడు ఒక పెద్ద శబ్దం వస్తుంది మొదటిసారి చూసినప్పుడు ఈ సన్నివేశాన్ని మీరు గమనించి ఉండరు. కానీ అప్పుడే పులి సౌండ్ వస్తుంది. భీం అప్పటినుండి కూడా జంతువులన్నిటికీ ఆహారాన్ని పెడుతూ దాడి కోసం వాటిని సిద్ధం చేస్తున్నాడు. చాలామంది ఈ దోస్తీ పాటలో ఈ సీన్ ని గమనించి ఉండరు.
Also read: