Advertisement
e: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2007లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. సినిమా సినిమాకు యాక్టింగ్ లో పరిణితి చూపిస్తూ ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ అయ్యాడు రామ్ చరణ్. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అలాగే కియారా అద్వానీ, అంజలి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. ఎస్ జె సూర్య, సునీల్, నాజర్, రఘు బాబు, జయరాం, సముద్రఖని, శ్రీకాంత్, నవీన్ చంద్ర, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Advertisement
Read also: పుట్టిన పిల్లలకు పచ్చ కామెర్లు ఎందుకు వస్తాయి… ఏ మేరకు ప్రమాదం!
ఇక ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ RC15 టైటిల్ ని రామ్ చరణ్ బర్త్ డే కానుకగా అనౌన్స్ చేశారు మేకర్స్. అలాగే టైటిల్ ని ప్రకటిస్తూ ఓ చిన్న వీడియో గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేశారు. ” గేమ్ చేంజర్” అనే టైటిల్ ని ఖరారు చేశారు. అయితే ముందుగా ఈ సినిమాకు సీఈవో, సర్కారోడు అనే టైటిల్స్ ని రిజిస్టర్ చేయించారు. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ కి ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు రావడంతో ఆయన ఇమేజ్ కి తగ్గట్టు, అలాగే కథకి తగినట్లుగా గేమ్ చేంజర్ అనే టైటిల్ ని ఖరారు చేశారు శంకర్. అలా ఈ సినిమాని ఇంగ్లీష్ లో విడుదల చేసినా వాళ్లకు క్యాచీగా ఉంటుంది. ఈ ఫస్ట్ లుక్ లో చరణ్ బైక్ పై కూర్చుని స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. అలాగే ఎక్కువ హెయిర్ తో, కళ్ళజోడు, చేతికి వాచ్ తో స్టైలిష్ టచ్ లో మాస్ ని పరిచయం చేశాడు.
Advertisement
ఇక టైటిల్ గ్లింప్స్ లో ఉన్న కాన్సెప్ట్ విషయానికి వస్తే.. ఎంతో క్రియేటివ్ గా ఈ టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు శంకర్. గ్లింప్స్ స్టార్టింగ్ లో క్యాసినో జూదం ఆడేందుకు తిరిగే చక్రాన్ని మొదట చూపిస్తూ.. దానిని పార్లమెంటు భవనంగా మార్చి చూపారు. మధ్యలో కింగ్ చుట్టూ ప్రజా ప్రతినిధులు ఉన్నట్లు చూపారు. జూదంలా సాగుతున్న రాజకీయాలలో కింగ్ రాకతో ” గేమ్ చేంజ్” అయిందని సూచిస్తున్నట్లు ఆ వీడియో ఉంది. అయితే కింగ్ ఆ పార్లమెంటులోకి అడుగుపెట్టగానే స్వస్తిక్ స్టాంప్ పుడుతుంది. ఆ కింగ్ ని, స్వస్తిక్ స్టాంప్ ని చూడగానే.. పార్లమెంట్ లో ఉన్నవాళ్లు అంతా చెల్లాచెదురైపోతారు. స్టార్టింగ్ వీల్ మీద తిరిగిన బాల్ పైకి ఎగురుతుంది. ఆ తర్వాత కింగ్ జనాలలోకి వెళతాడు.
అప్పుడు గేమ్ చేంజర్ టైటిల్ రివిల్ అవుతుంది. అయితే ఇక్కడ కింగ్ అంటే రామ్ చరణ్ అని మనకు తెలిసిందే. అస్తవ్యస్తంగా ఉన్న ఒక పొలిటికల్ సిస్టం ని ఒక కింగ్ లాంటి ఆఫీసర్ ఎలా చేంజ్ చేశాడు అనేది మెయిన్ కాన్సెప్ట్. అయితే ఆ స్వస్తిక్ సింబల్ అంటే మార్పుకి సంకేతం. ఈ మార్పు కి రాజకీయ నాయకుల పతనం మొదలవుతుంది. జనాలలోకి వెళ్లి మార్పుని మొదలు పెడతాడు కింగ్. ఇలా ఒక్క చిన్న గ్లింప్స్ లో ఈ సినిమాలో చాలా డెప్త్ ని చూపించారు శంకర్. ఇక ఈ చిత్రంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో ) గా నటిస్తున్నారు రామ్ చరణ్. ఈ ఏడాది వేసవి సెలవులలో గేమ్ చేంజర్ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
Read also: ఆనంద్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా.. ఈమె ఎంతో మందికి ఆదర్శం..!!