Advertisement
తాజాగా గురువారం లియో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు కూడా బాగానే ఆదరిస్తున్నారు. ఈ సినిమాను కు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) కు లింక్ చేస్తూ తీశారు. కొంచం జాగ్రత్తగా గమనిస్తే ఈ లింక్స్ అర్ధం అవుతాయి. అయితే.. ఎంత జాగ్రత్తగా ఈ సినిమాను డైరెక్ట్ చేసినా దర్శకుడు లోకేష్ ఒక చిన్న లాజిక్ ను మర్చిపోయారు. అదేంటో ఇప్పుడు చూసేద్దాం.
Advertisement
లియో ని చూసిన తరువాత సంజయ్ దత్ వాళ్ళ తమ్ముడికి లియో ఫోటో గురించి ఇన్ఫోర్మ్ చేస్తాడు. లియో ఫోటో తీసుకురండి అంటూ అర్జున్ కూడా ఆర్డర్ పాస్ చేస్తాడు. అప్పుడే లియో ఫోటోను పెయింట్ వేస్తూ.. ప్రస్తుతం ఉన్న ఫోటోను ఆ ఫోటోని మ్యాచ్ చేసి చూసుకుంటూ ఉంటారు. ఈ ఫోటో బ్యానర్ లో కింద “1989 లో మరణం” అని రాసి ఉంటుంది. లియో 1977 లో పుట్టినట్లు చూపిస్తారు. అంటే.. 1977 నుంచి 1989 వరకు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే ఉంది.
Advertisement
అంటే లియో వయసు 12 సంవత్సరాలు మాత్రమేనా? అని నెటిజన్స్ తెగ జుట్టు పీక్కుంటున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అతని వయసు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే అయితే.. లియో లో కనిపించిన విజయ్ ఆ వయసు అబ్బాయిలాగా లేడు కదా.. అయినా.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు లోకేష్ గారు? అంటూ నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన మీమ్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ పట్టించుకోనక్కర్లేదు అనుకుంటే.. సినిమా మాత్రం మంచి ఫీస్ట్ నే అందిస్తోంది.
- మరిన్ని Telugu news మరియు తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చదవండి !