Advertisement
రామ్ పోతినేని హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సినిమా “స్కంద”. భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదల అయిన సంగతి తెలిసిందే. సలార్ సినిమా విడుదల అయ్యే సమయానికి పోస్ట్ పోన్ అవ్వడంతో ఆ రిలీజ్ డేట్ ను స్కంద మూవీ టీం తీసుకున్నారు. మంచి రోజు రిలీజ్ చేసారు. వీకెండ్, హాలిడేస్ వచ్చినా కూడా స్కంద యావరేజ్ రిజల్ట్ తీసుకొచ్చింది. ఇక రెగ్యులర్ డేట్స్ లో రిలీజ్ అయ్యి ఉంటె సినిమా ఫలితం ఎలా ఉండేదో.
Advertisement
పాన్ ఇండియా రేంజ్ మూవీ అంటూ రిలీజ్ కి ముందు నుంచే హైప్ పెంచారు. పెద్ద మొత్తంలో థియేట్రికల్ హక్కులు విక్రయించడంతో.. భారీ నష్టాలను మిగిల్చింది స్కంద సినిమా. విడుదల అయిన నాలుగు వారాలకే స్కంద ఓటిటిలోకి వచ్చేసింది. హాట్ స్టార్ లో ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. ఓటిటిలో ఓ మోస్తరు రెస్పాన్స్ వస్తోంది. అయితే.. ఓటిటిలోకి అందుబాటులోకి వచ్చాక.. ఈ సినిమాలోని ఓ బ్లండర్ మిస్టేక్ వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో సీఎం గా నటించిన శరత్ లోహితశ్వకు రామ్ పోతినేనికి మధ్య ఓ యాక్షన్ సన్నివేశం ఉంటుంది.
Advertisement
ఆ టైం లో రామ్ ఓ వ్యక్తిని గన్ పెట్టి కాల్చి చంపుతాడు. దానికి శరత్ షాకింగ్ రియాక్షన్ ఇస్తాడు. రామ్ చేతిలో చనిపోయిన వ్యక్తే.. శరత్ షాకింగ్ రియాక్షన్ ఇస్తున్న సమయంలో శరత్ వెనుక బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తూ ఉంటాడు. అసలు ఇది నిజంగానే పెద్ద బ్లండర్.
దీన్ని గమనించకపోవడం ఏంటి అంటూ నెటిజన్స్ బోయపాటిని గట్టిగానే ఏసుకుంటున్నారు. నిజానికి ఏ సినిమాను అయినా రిలీజ్ కి ముందు మేకర్స్ ఒకటికి పది సార్లు చెక్ చేస్తారు. అయినా ఎక్కడో ఓ చోట తప్పు జరుగుతూనే ఉంటుంది. తప్పు జరగడం సాధారణం. ఇది కూడా అలాంటి పొరపాటే. కానీ చూసుకుని ఉంటె బాగుండేది.
https://x.com/harisrutea/status/1720119275095200246?s=20
మరిన్ని..
చిరంజీవి గురించి ఆ సినిమాలో అప్పుడు లావణ్య చెప్పిన మాటే నిజమయ్యిందిగా.. అదేంటంటే?
Maa oori Polimera 2 Review: మా ఊరి పొలిమేర 2 సినిమా తెలుగు రివ్యూ
Aarya Season 3 Review: ఆర్య సీజన్ 3 రివ్యూ.. ఒక్క బిట్ కూడా స్కిప్ చెయ్యకండి.. ఏ ఓటిటిలో చూడొచ్చంటే?