Advertisement
జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరో అయినా కానీ ఆయన జీవితంలో అనేక ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నారు. ఆయన తీసిన మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ తర్వాత తీసిన రెండు నుంచి మూడు సినిమాలు హిట్ అయ్యాయి. ఆ తర్వాత కూడా మళ్లీ చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత కొన్ని సినిమా హిట్ అయింది.. ఏది ఏమైనా ఎన్టీఆర్ ఇండస్ట్రీలో మాత్రం నిరాశపడకుండా ముందుకు సాగుతూనే వచ్చారు. అలా ఐదు నుంచి 6 ఫ్లాపులు వచ్చాయి. ఈ తరుణంలోనే ఎన్టీఆర్ పూరితో టెంపర్ అనే మూవీ చేశారు.
Advertisement
ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి సమానంగా ఉండే క్యారెక్టర్ అయిన మూర్తి పాత్ర లో ముందుగా ఆర్.నారాయణమూర్తిని తీసుకుందామని ట్రై చేశారట. కానీ నారాయణమూర్తి తన సినిమాలో తప్ప వేరే కమర్షియల్ సినిమాలు నటించను అని చెప్పారట. అయితే ఆ పాత్ర కోసం పూరి అతనికి బ్లాంక్ చెక్ ఇచ్చినప్పటికీ ఆయన తీసుకోలేదట. చివరికి పూరీ ఆ పాత్ర కోసం పోసాని గారిని తీసుకున్నారట. దీంతో పోసాని కృష్ణ ముర్తి కి ఈ పాత్రతో విపరీతమైన క్రేజ్ వచ్చి పడింది. తర్వాత ఆయన బిజీ నటుడుగా మారిపోయారు.
Advertisement
అయితే పూరి ఈ పాత్ర నారాయణమూర్తి కోసమే రాశారు అయినా కూడా ఆయన చేయకపోవడంతో పూరి గారు ఆ పాత్రలో వేరే వాళ్ళను ఊహించుకోలేక నారాయణమూర్తి చేయలేకపోయినా కానీ ఆయన మీద ఉన్న అభిమానంతో ఆ పాత్రకి మూర్తి అనే పేరు పెట్టారు. అలా నారాయణమూర్తి ఒక మంచి క్యారెక్టర్ మిస్ చేసుకున్నారని చెప్పవచ్చు. ఒకవేళ ఆయన చేసి ఉంటే ఈ చిత్రంలో మరిన్ని సీన్స్ హైలెట్ అయి ఉండేవి. అయితే ఈ చిత్రంతో అటు పూరి ఇటు ఎన్టీఆర్ చాలా బిజీగా మారిపోయారు. ఇక అప్పటినుంచి ఎన్టీఆర్ తనకు ఫ్లాప్ అనేది లేకుండా వరుసగా ఆరు విజయాలు అందుకున్నారు.
also read:సంఖ్య శాస్త్రం ప్రకారం ఈ నెలలో వివాహం చేసుకున్న వారి జీవితం మొత్తం అదృష్ట మయమే !