Advertisement
ప్రస్తుతం దేశంలో టాక్స్ లు చెల్లించే వ్యక్తులు చాలా మంది గందరగోళానికి గురి అవుతున్నారు. టాక్స్ రిఫండ్ కోసం అప్లై చేసినప్పటికీ వారి మనీ తిరిగి రాకపోవడంతో ఈ గందరగోళం నెలకొని ఉంటోంది. చెల్లించాల్సిన టాక్స్ కంటే ఎక్కువ టాక్స్ కట్టినప్పుడు రిఫండ్ చేసే ప్రక్రియను ఐటి శాఖ చూసుకుంటుంది. ఇందుకోసం ఐటిఆర్ ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది ఈ ప్రక్రియ పూర్తి చేసినా కూడా తమ రిఫండ్ రాలేదని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే.. మీరు ఐటీఆర్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఈ కింది పొరపాట్లు జరిగాయేమో సరి చూసుకోండి.
Advertisement
ఐటీఆర్ లో మీరు పేర్కొన్న బ్యాంకు వివరాలు తప్పుగా నమోదు అయ్యి ఉండవచ్చు. కొన్నిసార్లు ఇతర కారణాల వలన కూడా ఈ రిఫండ్ రావడం అనేది ఆలస్యం అవుతూ ఉండవచ్చు. అయితే ఏదైనా పొరపాటు జరిగి మీ ఐటి రిటర్న్ వెరిఫికేషన్ ను ధృవీకరించకపోయినా కూడా మీకు రిఫండ్ వాపసు రాదు. ఈ వెరిఫికేషన్ కూడా పూర్తి అయితేనే ఐటీఆర్ ప్రక్రియ పూర్తి అయ్యిందని అర్ధం.
Advertisement
అలాగే ఫారమ్ 26AS, AISలో నమోదు చేయబడిన ట్రాన్సక్షన్ వివరాలు, పన్ను చెల్లింపులు, మినహాయింపులు అన్నిటిని వెరిఫై చేసిన తరువాతే రిఫండ్ ఇస్తారు. ఐటీఆర్ పాత్రలకు, ఈ AIS పత్రాలకు మధ్య ఏమైనా తేడా ఉన్నా మీ క్లెయిమ్ కాన్సుల్ అయిపోతుంది. ఇలా ఐటిఆర్ పెండింగ్ లో పడిపోయినప్పుడు రివైజ్డ్ రిటర్న్స్ ఫైల్ చెయ్యాల్సి వస్తుంది. అలాగే టాక్స్ పేయర్ ఒకవేళ తక్కువ పన్నునే చెల్లించి ఆ రసీదులు జత చేస్తే.. పన్ను చెల్లించాలని ఐటి శాఖ నోటీసు పంపుతుంది. ఒకవేళ క్లెయిమ్ కు మద్దతుగా మీరు కొన్ని డాకుమెంట్స్ ను జత చేయడం మర్చిపోయినా కూడా ఈ రిఫండ్ ఆలస్యం అవుతుంది. అవసరమైన డాకుమెంట్స్ ను చెక్ చేసుకుని మళ్ళీ పంపించి ప్రాసెస్ చేసిన తరువాత మాత్రమే మీ అప్లికేషన్ ప్రాసెస్ ముందుకు జరిగి మీ అమౌంట్ రిఫండ్ అవుతుంది.
మరిన్ని..
ఇంగ్లాండ్ పై ఆఫ్ఘన్ గెలుపుకి BCCI చేసిన పరోక్ష సహాయం ఇదేనా ?
ప్రవల్లిక కేసులో అసలు జరిగింది ఇదే.. సంచలన విషయాలు బయట పెట్టిన తల్లి, తమ్ముడు!