Advertisement
చాలామంది ప్రేమలో పడతారు కానీ ప్రేమలో సక్సెస్ అవ్వలేకపోతుంటారు ప్రేమలో పడ్డాక కొన్ని ఏళ్లకు విడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే ప్రేమలో పడిన తర్వాత చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ వుంటారు. ప్రేమ ఎట్రాక్షన్ అనేది తెలుసుకోలేకపోతుంటారు. ప్రేమకి ఎట్రాక్షన్ కి తేడా ఏమిటి..? ఎలా ప్రేమో అట్రాక్షన్ ఓ కనిపెట్టాలి అనే విషయాలని ఇప్పుడే చూసేద్దాం. ఈ రెండిటినీ ఈజీగా మీరు గుర్తిస్తే లైఫ్ లో ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఇష్టపడే వారు మీతో ఎప్పుడూ కూడా హ్యాపీగానే కనిపించొచ్చు కానీ మీకంటే మిగతా విషయాలు ఎక్కువ ఇంపార్టెంట్ అని ఫీల్ అయితే కొంచెం ఆలోచించాలి.
Advertisement
అది ఎట్రాక్షన్ అయి ఉండొచ్చు అని మీరు గమనించాలి. ఒకవేళ కనుక మీ మీద ఇంపార్టెన్స్ తగ్గుతూ ఉన్నట్లయితే కూడా అది అట్రాక్షన్ అని మీరు అర్థం చేసుకోవాలి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది తప్పించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని కచ్చితంగా అనుమానించాలి మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మీ ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది చెప్తారు. అలానే భవిష్యత్తులో ఏమేం చేయాలి అనేది కూడా చెప్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని వదులుకోకండి. అది కచ్చితంగా ప్రేమ అవుతుంది. ఒకవేళ ఫ్యూచర్ గురించి మాట్లాడకుండా వాళ్ళు తప్పించుకున్నట్లయితే అది ఎట్రాక్షన్.
Advertisement
అట్రాక్షన్ ఉంటే ఫిజికల్ గా దగ్గర అవ్వడానికి ట్రై చేస్తుంటారు మానసికంగా దగ్గర అవ్వడానికి ట్రై చేయరు. మీకు ఏమి ఇష్టం మీ అభిరుచులు ఏంటి అనేది అసలు పట్టించుకోరు. శారీరకంగా దగ్గర అవడానికి మాత్రమే ట్రై చేస్తూ ఉంటారు మీకు ఇష్టమైన వాటి గురించి అస్సలు పట్టించుకోరు. ఇలా ఈ విధంగా కూడా మీరు ప్రేమనో అట్రాక్షన్ ఓ తెలుసుకోవచ్చు. మీ పర్సనల్ లైఫ్ గురించి పట్టించుకోకపోవడం, వాళ్ళ పర్సనల్ లైఫ్ ని దాచిపెట్టడం వంటివి చేస్తే కూడా అట్రాక్షన్ అని మీరు కనిపెట్టొచ్చు. మీ గురించి వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ముందు చెప్పడానికి ముందుకు రాకపోతుంటే అట్రాక్షన్ అని మీరు అర్థం చేసుకోవాలి. అదే మిమ్మల్ని వాళ్ళు ఇష్టపడుతున్నట్లయితే ఓపెన్ గా మాట్లాడుతారు ఇలా ఉంటే కచ్చితంగా మీరు ప్రేమ అని అర్థం చేసుకోవచ్చు ఇలా ప్రేమను అట్రాక్షన్ తెలుసుకోవచ్చు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!