Advertisement
ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో సక్సెస్ అవుతారు అందులో డౌట్ లేదు అయితే ఒకొక్కసారి సక్సెస్ అవ్వడం లేట్ అవ్వచ్చు కానీ కష్టపడితే కచ్చితంగా ఫలితం ఏదో రోజు వస్తుంది. బీహార్ లోని పట్నా విమానాశ్రయం నుండి సొంత స్వగ్రామం వెళ్ళాలి అనుకున్న ఒక టెక్కీ రాత్రి రెండు గంటల టైం లో రోడ్డుపై క్యాబ్ బుక్ చేసుకున్నాడు చాలా సేపటి దాక క్యాబ్ రాలేదు ఆ సంస్థ సీఈఓ కి తనకి ఎవరైనా అనుభవాన్ని వివరిస్తూ మెయిల్ చేశాడు వెంటనే ఐదు నిమిషాల్లో ఇంకొక క్యాబ్ వచ్చింది. డ్రైవర్ సీట్ లో ఉన్నది స్వయంగా సంస్థ వ్యవస్థాపకుడు దిల్కుష్ కుమార్. బీహార్ స్టార్ కింగ్ ఇలా డ్రైవర్ గా రావడం మీద టెక్కీ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ విషయంపై సోషల్ మీడియా లో షేర్ చేసుకోవడం తో ఇప్పుడు దిల్ కుష్ కుమార్ గురించి మళ్ళీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
Advertisement
బీహార్ లో సహస్ర జిల్లాలోని బనగావ్ అనే మారుమూల గ్రామానికి చెందిన పవన్ కాన్ ప్రైవేట్ బస్ డ్రైవర్ గా ఉండేవాడు. అతని కొడుకు దిల్కుష్ కుమార్ తన కొడుకుని పెద్ద చదువులు చదివించాలనుకున్న కుదరలేదు. రోడ్డు ప్రమాదం లో అతను ఇంటికి పరిమితం అయిపోయాడు ఇంటి బాధ్యతలు దిల్కుష్ చూసుకోవాల్సి వచ్చింది. ఇంటర్ చదువు మానేసి ఒక కంపెనీ లో సెక్యూరిటీ గార్డ్ గా చేరాడు. 18 ఏళ్ల వయసులో పెళ్లి చేసేసారు దీంతో ఒక స్కూల్లో క్లర్క్ గా పని కోసం ప్రయత్నించాడు. క్యాబ్ డ్రైవర్ గా పని చేయడానికి ఢిల్లీ వెళ్లిన అతనికి అక్కడ అవమానాలు ఎదురయ్యాయి. చేసేదేమీ లేక రిక్షా తొక్కడం మొదలు పెట్టాడు. రెండు నెలల తర్వాత అక్కడ వాతావరణం పడక అనారోగ్యానికి గురయ్యాడు. సొంతూరు తిరిగి రావాల్సి వచ్చింది.
Advertisement
Also read:
Also read:
తర్వాత ఒక వ్యాపార దగ్గర కారు డ్రైవర్గా చేరానని ఆదాయం సరిపోక పోవడం తో సాయంత్రం పూట కూరగాయలు అమ్మే వాడిని అని దిల్ కుష్ కుమార్ చెప్పారు. స్వయం ఉపాధి తనకి ఎంతో ఆత్మ విశ్వాసాన్ని తీసుకువచ్చిందని ఏ పని చేసినా సొంతంగా చేయాలనుకున్నానని అదే సమయంలో పట్నాలో ఓలా ఉబర్ సంస్థలు వచ్చాయి. క్యాబ్ సేవలు పల్లె ప్రాంతాలకు అందిస్తే ఎలా ఉంటుందని దిల్ కుష్ కి ఐడియా వచ్చింది. సెకండ్ హ్యాండ్ నానో కారు కొని జిల్లాలోని సేవలు ప్రారంభించాడు. తర్వాత పల్లెటూర్లో ఈ క్యాబ్ సర్వీస్ ల డిమాండ్ పెరిగింది ఆరు లక్షల అప్పుచేసి ఇంకో రెండు శాంత్రో కార్లు కొని సేవలుని విస్తరించాడు. 150 కిలో మీటర్ల కి 4500 తీసుకుంటారు అలా కాకుండా ప్రయాణికులకు ఒకవైపు చార్జీలు మాత్రమే వసూలు చేయాలని అనుకున్నారు. ఈ సంస్థని ప్రారంభించాడు 1500 కే 200 కిలోమీటర్ల క్యాబ్లో వెళ్లే అవకాశాన్ని కల్పించాడు బీహార్లో అతి పెద్ద క్యాప్ సంస్థగా రోడ్ బేజ్ అవతరించింది. 10 కోట్ల కి ఈ సంస్థ విలువ చేరింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!