Advertisement
T20 World Cup 2022 : టి20 ప్రపంచ కప్ లో టీమిండియా కీలక సమరానికి సిద్ధమవుతోంది. ఆడిలైడ్ వేదికగా బుధవారం బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే సెమి ఫైనల్ కు చేరుకోవడం ఖాయం. ప్రస్తుతం భారత్ మూడు మ్యాచ్ లో రెండు విజయాలు, ఒక ఓటమితో 4 పాయింట్ల తో గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ పై గెలిస్తే భారత్ 6 పాయింట్లకు చేరుకోవడంతో పాటు సెమీఫైనల్ లో దాదాపు బెర్త్ కన్ఫార్మ్ అవుతుంది.
Advertisement
ఈ నేపథ్యంలోనే ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. ఇండియా డాషింగ్ ఫినిషర్ దినేష్ కార్తీక్ ఇక తన క్రికెట్ కెరీర్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ 2022లో ఆడుతున్న డీకే, ఈ మెగా టోర్నీ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు సమాచారం. 2004 లోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన డీకే 18 ఏళ్ల కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.
Advertisement
2007లో సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన తొలి t20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ఆ విన్నింగ్ టీం లో డీకే కూడా సభ్యుడే. అలాగే 2018 లో నిదాస్ ట్రోఫీ సందర్భంగా బంగ్లాదేశ్ పై ఆడిన ఇన్నింగ్స్ దినేష్ కార్తీక్ కెరీర్ లోనే బెస్ట్ ఇన్నింగ్స్ గా నిలిచింది. ఒంటిచేత్తో టీం ఇండియాను గెలిపించి, విజేతగా నిలిపిన ఆ మ్యాచ్ ఒక విధంగా డీకే కెరీర్ ను పూర్తిగా మార్చేసిందనే చెప్పాలి. అయితే, సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో దినేష్ కార్తీక్ గాయపడ్డాడు. దీంతో, రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఏజ్ బార్ కావడంతో ఈ నిర్ణయం తీసుకోబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.
read also : టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ కు తప్పిన ప్రమాదం ?