Advertisement
త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా మారిన డైలాగ్ రైటర్. త్రివిక్రమ్ శ్రీనివాస్ 1999 లో స్వయంవరం సినిమా ద్వారా మాటల రచయితగా తెరంగేట్రం సినిమా రంగప్రవేశం చేశారు. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు వంటి సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే, రచయితగా అతడు, జులాయి, అత్తారింటికి దారేది, అరవింద సమేత, అజ్ఞాతవాసి వంటి సినిమాలకు దర్శకునిగా తెలుగు సినిమా రంగంలో పేరు పొందాడు.
Advertisement
అయితే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కూడా ఓ సెంటిమెంట్ ఉంది. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించా.రు ఈ క్రమంలో పంజాగుట్టలోని సాయిబాబా ఆలయానికి సమీపంలో ఉండే ఓ చిన్న గదిలో అద్దెకు ఉండేవారు. నటుడు సునీల్, డైరెక్టర్ దశరథ్ లతో కలిసి అద్దె ఇంట్లో ఉండేవారు. అక్కడి నుంచే త్రివిక్రమ్ ఎన్నో సినిమాలకు కథలు అందించారు.
Advertisement
స్వయంవరం, సముద్రం, నిన్నే ప్రేమిస్తా, నువ్వే కావాలి, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావు ఇలాంటి సినిమాలకు ఆ ఇంట్లోనే ఉంటూ త్రివిక్రమ్ మాటలు అందించారు. ఆ తర్వాత ఆయన దర్శకుడిగా మారి పలు సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం త్రివిక్రమ్ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. అయినా తనకు మొదట ఆశ్రయమిచ్చిన ఆ అద్దె ఇల్లు అంటే త్రివిక్రమ్ కు ఎంతో మమకారమట. అందుకే ఆ ఇంటినీ వదులుకోలేక ప్రతి నెల 5000 రూపాయల అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా సెంటిమెంట్ గా ఇప్పటికీ కొన్ని సినిమాలకు అక్కడి నుంచే కథలు, మాటలు రాస్తారట.