Advertisement
ఈరోజుల్లో వస్త్రధారణ విషయంలో ఎన్నో మార్పులు వచ్చాయి. రకరకాల ఫ్యాషన్ బట్టలను చాలా మంది వేసుకుంటున్నారు. జీన్స్, టీషర్ట్లు వంటివి కూడా ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ కామన్ గా వేసుకుంటున్నారు. జీన్స్ వేసుకోవడం వలన అమ్మాయిలకు కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అమ్మాయిలు జీన్స్ వేసుకోవడం వలన పలు నష్టాలు అయితే తప్పవని తెలుస్తోంది. మరి ఎటువంటి నష్టాలు కలుగుతాయి అనే విషయానికి వచ్చేస్తే.. అమ్మాయిలు టైట్ జీన్స్ ధరించడం వలన తొడ చుట్టూ దురదలు వచ్చే ప్రమాదం ఉంది. చర్మానికి జీన్స్ అంటి పెట్టుకోవడం వలన చెమట ఎండిపోదు.
Advertisement
ఇది దురద చర్మం ఎర్రగా మారడానికి కారణం అవుతుంది. టైట్ జీన్స్ అమ్మాయిలను ఎక్కువగా ధరించకపోవడమే మంచిది. అలానే చాలా బిగుతుగా ఉండే జీన్స్ రక్తప్రసరణను అడ్డుకుంటాయి ముఖ్యంగా కాళ్లల్లో దీని వలన తిమ్మిరి నొప్పి మైకం వంటివి లక్షణాలు కనబడతాయి. దీర్ఘకాలంగా వేసుకుంటే తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. బిగుతుగా ఉండే జీన్స్ పొట్ట మీద ఒత్తిడి తెచ్చే జీర్ణ క్రియని నెమ్మదిస్తుంది. పైగా నరాలపై ఒత్తిడి కలుగుతుంది. ఈ నొప్పి జలదరింపు మొద్దు బారుట వంటి లక్షణాలు కనబడతాయి. తుంటి ప్రాంతంలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. జీన్స్ వేసుకోవడం వలన చర్మం దురద చికాకుకి గురవుతుంది. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉంటే బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తుంది. సంక్రమణలకు దారితీస్తుంది.
Advertisement
Also read:
పురుషులకు బిగుతుగా ఉండే జయించ వృషణాలను వేడి చేయొచ్చు. కణాల నాణ్యత సంఖ్యను తగ్గిస్తుంది బిగుతుగా ఉండే జీన్స్ వేసుకోవడం వలన సౌకర్యంగా ఉండదు పైగా నడవడానికి కూర్చోవడానికి కూడా సులభంగా ఉండదు. ఒకేసారి చాలా గంటల పాటు జీన్స్ ధరించకుండా ఉండడమే మంచిది. ఎక్కువగా జీన్స్ ధరించే వాళ్ళు అప్పుడప్పుడు వేసుకోండి. మధ్య మధ్యలో కాస్త చర్మానికి గాలి తగిలే దుస్తులు వేసుకోండి. జీన్స్ ధరించిన తర్వాత చర్మాన్ని శుభ్రంగా కడుక్కోండి. పొడిగా ఉంచుకోండి. ఇలా ఈ టిప్స్ ని పాటిస్తే మంచిది. లేదంటే అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!