Advertisement
శ్రీహరి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. రియల్ హీరోగా తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు శ్రీహరి విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా హీరోగా కూడా ఎన్నో పాత్రలు చేసారు. మంచి ఫేమ్ ఉన్న సమయంలో చనిపోవడం బాధాకరం. శ్రీహరి దేవ, సాంబయ్య, పోలీస్, భద్రాచలం వంటి సినిమాలతో హిట్లు కొట్టారు కొంతకాలం హీరోగా నటించిన తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేసారు. శ్రీహరి 100కు పైగా సినిమాలు నటించి పాపులర్ అయ్యారు. శ్రీహరి 1996లో డిస్కో శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పైగా అప్పట్లో ఆమె ఎంత పెద్ద ఆర్టిస్ట్ ప్రత్యేకించి మనకి మనం చెప్పక్కర్లేదు. ఐటెం సాంగ్స్ కూడా ఆమె చేసేవారు.
Advertisement
Advertisement
కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు తమిళనాడు సినిమాల్లో కూడా ఆమె నటించారు తాజాగా శ్రీహరి భార్య డిస్కో శాంతి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. తన భర్త శ్రీహరి మరణంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయని ఆయన బతికున్న రోజుల్లో ఇంటికి ఎవరు వచ్చినా సరే సహాయం చేసే వారని ఆమె అన్నారు. ఆయన ఉన్నప్పుడు ఎన్నో కోట్లు సంపాదించారు కానీ ఇప్పుడు మాత్రం కుటుంబ పరిస్థితి ఘోరంగా మారిపోయిందని ఆమె అన్నారు.
Also read:
ఒక్క నమస్కారంతో వేల మందిని ఎన్టీఆర్ ఎలా కంట్రోల్ చేసారంటే..!
శ్రీహరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు ఓ మూవీ చేశాడు. ఈ మూవీ అనుకున్నంత హిట్ అవ్వలేదు. మంచి హిట్ కోసం అతను ట్రై చేస్తున్నాడు. కానీ శ్రీహరి భార్య శ్రీహరి మరణంతో ఇంత ఇబ్బంది పడడం బాధాకరం. శ్రీహరి ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఎంతో మందికి సహాయం చేసిన ఓ కుటుంబం ఇలా అయ్యిపోయిందేంది అని నెటిజెన్స్ ఎమోషనల్ అవుతున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!