Advertisement
భర్తకు వచ్చిన అనుమానమే పెనుభూతంగా మారింది. చివరికి చక్కని సంసార జీవితాన్ని నాశనం చేసింది. క్షణికావేశంలో చేసిన పని వారి జీవితాన్ని ఆగం చేసింది. పూర్తి వివరాలు ఏంటో చూద్దామా.. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా చీడికా గ్రామంలో నాగేంద్ర అనే వ్యక్తికి 2013లో తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన మేన మరదలు రాజ్యలక్ష్మితో వివాహం జరిగింది. ఆమె డిగ్రీ పూర్తి చేసింది. కానీ నాగేంద్ర ఏమీ చదువుకోలేదు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. వీరిద్దరూ కలిసి కూలిపనులు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. భార్య చదువుకుంది కాబట్టి కూలి పనులు చేస్తే ఇంట్లో పూట గడవడం కష్టంగా మారింది. దీంతో ఆమె ఉద్యోగం చేస్తానని ఒక షాపింగ్ మాల్ లో సేల్స్ గర్ల్ గా చేరింది. కొన్నాళ్లకు ఒక ఫోన్ కూడా కొనుగోలు చేసుకుంది.
Advertisement
ఇక అప్పుడు మొదలైంది వీరి మధ్య చిచ్చు.. రోజు ఉద్యోగానికి వెళ్తూ సాయంత్రం వచ్చేది. వచ్చిన తర్వాత ఫోన్లో వారి బంధువులతో, స్నేహితులతో మాట్లాడేది. తరచూ ఫోన్ పట్టుకుంటూ ఉండేది. కానీ నాగేంద్రకు ఫోన్ గురించి ఏమి తెలియదు. ఆమె ఏం చేస్తుందో అని అనుమానం పెంచుకున్నాడు. నన్ను ఎక్కడ నిర్లక్ష్యం చేస్తుందని భయపడిపోయేవాడు. ఆమె ఫోన్లో మెసేజ్ లలో ఏముంది అని తెలుసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఒక్కో రోజు ఆమెను కొడుతూ రాక్షసుడిలా మారిపోయాడు. అలా ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి.
Advertisement
చివరికి భార్యను ఉద్యోగం మాన్పించేసాడు. అయినా అనుమానం తగ్గలేదు. నాగేంద్ర టార్చర్ తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళింది రాజ్యలక్ష్మి. తర్వాత పుట్టింటి వాళ్ళు సర్ది చెప్పి ఇద్దరినీ కలిపారు. అలా కొద్ది రోజులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇక ఆవేశంతో ఊగిపోయిన నాగేంద్ర ఇంట్లో ఉన్న కత్తిపీటతో భార్య తలపై బలంగా కొట్టాడు. దీంతో అని అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. వెంటనే నాగేంద్ర పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు :