Advertisement
చంద్రబాబు నాయుడు కు మధ్యంతర బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. నాలుగు వారాల పాటు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు హై కోర్ట్ పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రికి కంటిశుక్లం శస్త్రచికిత్స చేయాల్సి ఉండడంతో.. ఆయన పూర్తిగా కోలుకోవడం కోసం ఈ మధ్యంతర బెయిల్ ను ఇచ్చారు. నాలుగు వారాల పాటు ఈ బెయిల్ ను ఇవ్వడం జరిగింది. నవంబర్ 28 వ తేదీ వరకు ఆయన బెయిల్ పైనే ఉండనున్నారు. అయితే.. చంద్రబాబు నాయుడుని మళ్ళీ అరెస్ట్ చేస్తారా? అన్న సందేహాలు ఇటు ప్రజల్లోనూ, అటు టీడీపీ వర్గాల్లోనూ నెలకొంటున్నాయి.
Advertisement
చంద్రబాబు నాయుడుకు ఇప్పటికి బెయిల్ వచ్చినా ఇతర కేసుల్లో ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. అయితే.. ఇప్పటికే సిబిఎన్ కు అంగళ్ళు, రింగ్ రోడ్ కేసు విషయాల్లో ముందస్తు బెయిల్ లభించింది. ఇవి కాకుండా స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్ కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు ఇంకా తీర్పు ఇవ్వాల్సి ఉంది. ఈ కేసులపై ఇంకా వాదనలు జరగాల్సి ఉంది.
Advertisement
ఈ క్రమంలో చంద్రబాబుని మళ్ళీ అరెస్ట్ చేస్తారా? అన్న సందేహాలు వస్తున్నాయి. అయితే సుప్రీం కోర్ట్ తీర్పు ఇవ్వాల్సిన కేసులను క్వాష్ చేస్తే 17 -A వర్తించే ఏ కేసులోనూ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం కుదరదు. అయితే.. గవర్నర్ పర్మిషన్ తీసుకుని కొత్త కేసులు పెడితే మాత్రం అరెస్ట్ చేసే అవకాశం ఉందని లాయర్ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని..
Tollywood Star Hero’s: మన 6 స్టార్ హీరోలు డెబ్యూట్ అవ్వాల్సిన సినిమాలు కానీ ! కానీ మిస్ అయ్యారు !
Suryakantham: సీనియర్ నటి సూర్యకాంతాన్ని రీప్లేస్ చేయగలిగిన ప్రెజెంట్ జనరేషన్ నటి ఎవరో తెలుసా?