Advertisement
అక్షయ తృతీయ విశిష్టత గురించి పద్మ పురాణంలో చెప్పబడింది. అక్షయ తృతీయ నాడు ఈ పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పటికీ తరగని సంపద వస్తుంది అని విష్ణువు నారద మహామునితో చెప్పారు. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన పనులతో పాటుగా కొన్ని పనులు చేస్తే మంచిది. మరి అక్షయ తృతీయ నాడు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.. ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే 10న వచ్చింది. ఈరోజు శుభ సమయం కనుక ఏ పని చేసినా కూడా మంచి జరుగుతుంది. బంగారం, వెండి సహా అనేక ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేయడం మంచిది.
Advertisement
అక్షయ తృతీయ రోజు సిరిసంపదలకి లోటు లేకుండా ఉండడం కోసం అనేక చర్యలు తీసుకుంటూ ఉంటారు. బంగారం లేదా వెండిని కొనడం మంచిది. తెలిసి తెలియకుండా చేసే పనులతో పేదరికం వస్తుంది. ఈరోజు ప్లాస్టిక్,అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలు కొనొద్దు. ఇలా చేయడం వలన ప్రతికూల శక్తి కలుగుతుంది. పేదరికం సంభవిస్తుంది.
Advertisement
Also read:
Also read:
37 ఏళ్ల క్రితం నాటి రెస్టారెంట్ బిల్.. చూసారంటే షాక్ అయ్యిపోతారు..!
అక్షయ తృతీయ నాడు ఎవరికి డబ్బులు ఇవ్వకండి. అలానే అప్పు ఇవ్వడం అశుభం. ఇంట్లో సిరిసంపదలు తరిగిపోతాయి. అక్షయ తృతీయ నాడు బంగారం ఆభరణాలు పోగొట్టుకోవడం చెడు శకునముగా భావిస్తారు. ఎటువంటి ఆర్థిక నష్టం జరిగిన అది శుభప్రదంగా పరిగణించబడదని గుర్తుపెట్టుకోండి. ఈరోజు సాయంత్రం చీపురుతో ఇల్లు తుడవకండి. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అక్షయ తృతీయ నాడు ఇంటిని మురికిగా ఉంచొద్దు శుభ్రంగా ఉంచుకోవాలి. అక్షయ తృతీయ నాడు దొంగతనం, అబద్ధం, జూదం మొదలైన తప్పులు చేయొద్దు. ఉల్లి మద్యం మాంసం తీసుకోవద్దు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!