Advertisement
హిందువులు తులసి మొక్కని పూజిస్తారు. ఉదయం, సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం పెట్టుకుంటూ ఉంటారు. తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. తులసి మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి కూడా వెంట ఉంటుందని పండితులు అంటున్నారు. తులసి దళాలని కొంతమంది కోసి దేవుళ్ళకి పెడుతూ ఉంటారు. అయితే తులసి ఆకులని తెంపేటప్పుడు ఈ పొరపాట్లని అస్సలు చేయకూడదు. తులసికి వచ్చే మంజీరీలు చాలా ముఖ్యమైనవి. మంజరి అన్ని పూలు కంటే శ్రేష్టమైనది. మంజరిని కోసేటప్పుడు తప్పనిసరిగా ఆకుల్ని కలిగి ఉండాలని గుర్తుపెట్టుకోండి.
Advertisement
Advertisement
తులసి ఆకుల్ని కోసేటప్పుడు ఎప్పుడు కూడా సూర్యాస్తమయం అయిన తర్వాత కోయకూడదు అది తప్పు. తులసి ఆకుల్ని తీసేటప్పుడు గోళ్లు ని ఉపయోగించకండి. తులసిని ఎప్పుడూ కూడా ఖాళీ ప్రదేశంలో పెట్టండి. సాయంత్రం తులసి దగ్గర దీపాన్ని వెలిగించడం అసలు మర్చిపోకండి. తులసి ఆకుల్ని అనవసరంగా కత్తిరించకూడదు. అది పాపం. తులసిని ఎప్పుడు ఏదైనా మతపరమైన కార్యక్రమాల్లో వాడాలి లేదంటే ఔషధాల్లో వాడాలి తప్ప అనవసరంగా వృధా చేయకూడదు. తులసి ఆకుల్ని తొక్కడం కూడా మంచిది కాదు. కింద పడిపోయిన ఆకుల్ని తొక్కడం వలన పాపం వస్తుంది. ఎండిపోయిన తులసి ఆకుల్ని చెత్తబుట్టలో వేయకూడదు మట్టిలో మాత్రమే వాటిని వేయాలి. ఇలా తులసికి సంబంధించి పొరపాట్లు చేయకండి.
Also read: