Advertisement
హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకమైనది. మాఘ మాసంలో బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది. ఈ రోజునే ఆ పరమశివుడు లింగ రూపంలో దర్శనం ఇస్తాడని పురాణాలు పేర్కొంటున్నాయి. శివరాత్రి పర్వదినాన బిల్వపత్రాలతో శివుని పూజించి, రాత్రి మేల్కొని మంత్రాలను జపించిన వ్యక్తికి శివుడు ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడని చెబుతారు.
Advertisement
భక్తవ శంకరుడు భోళా శంకరుడు అయిన ఆ పరమశివునికి అత్యంత ఇష్టమైన శివరాత్రి పర్వదినాన ఎవరైతే ఆ శివుని ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకు ఇష్టమైన విధంగా పూజాథికాలం నిర్వహిస్తారో వారిపై పరమశివుని కటాక్షం ఉంటుందని చెబుతారు. అలాంటి పర్వదినాన కూడా కొన్ని చేయకూడని పనులు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Read also: రంజితమే పాటలో “రష్మిక” కి మించి అదరగొట్టిన ఈ క్యూట్ భామను గుర్తుపట్టారా ?
Advertisement
ఈ సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం ఫిబ్రవరి 18వ తేదీన వస్తుంది. ఈ శివరాత్రి రోజున మద్యం, మాంసం వంటి వాటిని అస్సలు ముట్టుకోకూడదట. ఉదయాన్నే స్నానం ఆచరించి 8 లోపు కచ్చితంగా శివాలయాన్ని దర్శించాలట. అంతేకాదు స్వచ్ఛమైన నీటితో కానీ, ఆవుపాలతో కానీ స్వామివారికి అభిషేకం చేయడం ఉత్తమమని చెప్పవచ్చు. ఇక గర్భగుడిలోకి వెళ్లే సమయంలో పురుషులు చొక్కా ధరించకుండా శరీరంపై కండువా కప్పుకొని మాత్రమే శివుడికి అభిషేకం చేయాలి. ఇక మహిళలు మాత్రం అభిషేకం చేస్తున్న సమయంలో శివలింగాన్ని తాకకూడదు. అలాగే మన శరీరం నుంచి చెమట చుక్కలు కానీ, వెంట్రుకలు కానీ శివలింగంపై పడకుండా జాగ్రత్త పడాలి. ఇక పాలతో అభిషేకం చేయడానికి పాల ప్యాకెట్లను నోటితో కొరికి ఆ పాలతో స్వామివారికి అభిషేకం చేయకూడదు.
ఈ పర్వదినాన శివుడిని పూజించే సమయంలో, శివుడికి అర్చన చేసే సమయంలో పొరపాటున కూడా తులసి దళాలను ఉపయోగించకూడదని చెబుతున్నారు. ఈ శివరాత్రి పర్వదినాన భార్యాభర్తలు కూడా సంభోగానికి దూరంగా ఉండాలి. ఇక శివాలయానికి మొగలిపువ్వులను తీసుకురాకూడదు. శివరాత్రి రోజున తోటకూరను దానం చేస్తే మరింత ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా శివరాత్రి పర్వదినాన జాగరణం చేస్తూ స్వామి వారిపై దృష్టి సారించి మనసుతో స్వామి వారిని ఆరాధిస్తే ఆయన మన కోరికలను నెరవేరుస్తాడని పెద్దలు విశ్వసిస్తారు. ఇక ఈ విషయాలను ప్రతి ఒక్కరు జాగ్రత్తగా తెలుసుకొని పాటించాలని సూచిస్తున్నారు.
Read also: కేవలం నందమూరి కుటంబంలోనే ఎందుకు ఇలా ? వరుస పెట్టి ప్రమాదల వెనక ఇంత కథ ఉందా ?