Advertisement
బొప్పాయి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బొప్పాయిని తీసుకోవడం వలన అనేక లాభాలు ఉంటాయి. బొప్పాయిని వీటితో కలిపి తీసుకుంటే విషంతో సమానమని గుర్తుపెట్టుకోండి. బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఏ, పొటాషియం, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఫలితంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బొప్పాయి చాలా ప్రభావితంగా ఉంటుంది. బొప్పాయి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పచ్చి బొప్పాయి కూడా ఆరోగ్యానికి మంచిదే. మలబద్ధకం బరువు తగ్గడానికి బొప్పాయి బాగా పనిచేస్తుంది. బొప్పాయి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తున్నప్పటికీ కొన్ని ఆహార పదార్థాలతో అసలు తీసుకోకూడదు.
Advertisement
బొప్పాయితో పెరుగు కలిపి తీసుకోకూడదు. పెరుగు ఒంటికి చలవ చేస్తుంది. బొప్పాయి వేడి. ఫలితంగా ఈ రెండు కలిపి తీసుకోవడం వలన తలనొప్పి కలుగుతుంది. అలాగే బొప్పాయి తిన్నాక పాలు, టీ, కాఫీలు తాగకూడదు దీని వలన గ్యాస్ సమస్య కలగచ్చు. ఫలితంగా కడుపునొప్పి, మలబద్ధకం వంటివి రావచ్చు. బొప్పాయి మాదిరిగానే కాకరకాయ కూడా ఎన్నో లాభాలని అందిస్తుంది. కాకరకాయ బొప్పాయి కలిపి అస్సలు తినకూడదు.
Advertisement
Also read:
Also read:
ఈ రెండు కలిపి తీసుకోవడం చాలా ప్రమాదం. బొప్పాయిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. కాకర నీటిని పీల్చుకుంటుంది. ఫలితంగా రెండిటిని కలిపి తీసుకుంటే డిహైడ్రేషన్ వస్తుంది. అంతేకాదు బొప్పాయితో నిమ్మకాయ కలిపి తినకండి. బొప్పాయి తిన్న తర్వాత కూడా చాలా సేపటి దాకా నిమ్మకాయని తీసుకోవద్దు. ఈ రెండు కలిపి తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు వస్తాయని గుర్తు పెట్టుకోండి. ఒకవేళ మీరు ఇటువంటి పొరపాట్లు చేస్తున్నట్లయితే ఇక మీదట మానుకోండి.
ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!