Advertisement
ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు ఇంటికి లక్ష్మీదేవి వచ్చి అష్టైశ్వర్యాలు కలగాలని అనుకుంటుంటారు హిందువుల్లో చాలామంది తమకి అష్టైశ్వర్యాలు కలగాలని ఇష్టమైన లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉంటారు. ఎందుకంటే ధనానికి ఆమె అధిపతి కనుక. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా కూడా ఆమె అనుగ్రహం కచ్చితంగా ఉండాలి. అయితే చాలామంది భక్తులు తమ అనుకూలతలు ఇష్టాలని బట్టి వివిధ రూపాలు అలానే అలంకారాలు చిత్రాలు ఉన్న లక్ష్మీదేవి పట్టాలని బొమ్మలని పూజిస్తారు. అయితే తెలియక చాలామంది ఈ పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం కలగదని గుర్తుపెట్టుకోండి. కొన్ని రకాల లక్ష్మీదేవి చిత్రపటాలని పూజిస్తే ధనం అసలు రాదు. పైగా ఉన్న ధనం కూడా వెళ్ళిపోతుంది. మరి ఎటువంటి తప్పులు భక్తులు చేయకూడదనేది చూద్దాం.
Advertisement
వీటిని కూడా చదవండి: హరహర మహాదేవ అని ఎందుకు శివుడిని మ్రొక్కుతాము..? కారణం తెలుసా..?
Advertisement
గుడ్లగూబ మీద కూర్చున్న లక్ష్మీదేవి బొమ్మ ఇంట్లో పెట్టి పూజించకూడదు దీని వలన ఆశుభం కలుగుతుంది ధనం వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోతుంది. తామర పువ్వు మీద లక్ష్మీదేవి నిలుచుని ఉన్న ఫోటో కాకుండా కూర్చున్నట్టుగా ఉన్న ఫోటోని పూజించడం మంచిది ఇలా చేస్తే శుభం కలుగుతుంది. ఐశ్వర్యం వస్తుంది. అలానే గరుత్మంతుని పై విష్ణువుతో పాటుగా లక్ష్మీదేవి కూర్చుని ఉన్న ఫోటోని పూజించిన ధనం లభిస్తుంది అంతా మంచి జరుగుతుంది. శేషతల్పం మీద విష్ణువు పడుకుని ఉండి కాళ్ల వద్ద లక్ష్మీదేవి ఉన్న బొమ్మని పూజిస్తే అటువంటి వారి దాంపత్య జీవితం సుఖమయంగా సాగుతుంది.
వీటిని కూడా చదవండి: శివుడికి బిల్వపత్రం సమర్పించేటప్పుడు.. ఈ తప్పులు అస్సలు చెయ్యద్దు..!
అలానే పాదరసంతో తయారు చేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజిస్తే శుభం కలుగుతుంది కుబేరుని విగ్రహం లేదా ఫోటోని ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది. ఆ ఇంట అష్టైశ్వర్యాలు సిరిసంపదలు ఉంటాయి. దీపావళి నాడు స్పటిక శ్రీ యంత్రాన్ని ఒక ఎర్రని వస్త్రంలో చుట్టి దానిని మీ డబ్బుల బీరువాలో పెట్టుకుంటే మంచిది. ఇలా చేయడం వలన శుభం కలుగుతుంది. తులసి ఆకులు, ధూపం, దివ్వెలు తో పాటు పూలను పెట్టి లక్ష్మీదేవికి పూజ చేస్తే చాలా మంచిది. అనుకున్నది జరుగుతుంది. దీపావళి రోజు లక్ష్మీదేవిని కుబేరుని పూజిస్తే చాలా మంచి జరుగుతుంది ఇలా ఈ విధంగా మీరు ఆచరించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట నిత్యం కొలువై ఉంటుంది సంతోషంగా ఉండొచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!