Advertisement
వాస్తు ప్రకారం పాటించడం వలన ఇంట్లోకి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎలాంటి నెగటివ్ ఎనర్జీ అయినా కూడా తొలగిపోతుంది. అయితే చాలామంది ఇంట్లో అనేక రకాల మొక్కల్ని నాటుతూ ఉంటారు. మొక్కలు ఇంట్లో ఉంటే అందంగా ఉండటమే కాదు పాజిటివ్ ఎనర్జీ కూడా వ్యాపిస్తుంది. కానీ కొన్ని మొక్కల్ని మాత్రం ఇంట్లో అస్సలు పెంచకూడదు. వాటి వలన కష్టాలు వస్తాయి. మరి ఇంట్లో ఎలాంటి మొక్కలు ఉండకూడదు అనే విషయానికి వచ్చేస్తే.. ఈ మొక్కలని అస్సలు ఇంట్లో ఉంచకూడదు.
Advertisement
Advertisement
జిల్లేడు, సపోటా వంటి పాలు కారే మొక్కల్ని ఇంట్లో పెంచకూడదు. రేగు చెట్టుని ఇంట్లో పెట్టకూడదు. దాని వలన కూడా నష్టాలు వస్తాయి. ఇంటి ద్వారం ఎదురుగా గులాబీ మొక్కలను కూడా పెంచకూడదు. మర్రిచెట్టు కూడా ఇంట్లో ఉండకూడదు. చింత చెట్టు కూడా ఇంట్లో ఉండకూడదు. ఇటువంటి మొక్కలు ఇంట్లో ఉండడం వలన అనేక సమస్యలు కలుగుతాయి. నెగటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. వైవాహిక జీవితంలో కూడా చింత చెట్టు వల్ల కష్టాలు వస్తాయి. ఖర్జూర చెట్టు ఇంట్లో ఉంటే పేదరికం కలుగుతుంది రావి చెట్టుని కూడా ఇంట్లో పెట్టకూడదు. ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.
Also read: