Advertisement
కొన్ని విషయాలని జీవిత భాగస్వామికి చెప్పకపోవడమే మంచిది. జీవిత భాగస్వామితో కొన్ని విషయాలని అస్సలు చర్చించొద్దు. దాని వలన ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మరి అసలు జీవిత భాగస్వామికి ఎటువంటి విషయాలు చెప్పకూడదనే దాని గురించి చూద్దాం.. గత ప్రేమల గురించి ఎప్పుడూ జీవిత భాగస్వామికి చెప్పకూడదు. అలా చేస్తే మీపై అనుమానం పెరిగి సమస్యలు వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా గత ప్రేమల గురించి చెప్పొద్దు. అలానే మీ క్రష్ గురించి కూడా మీ జీవిత భాగస్వామితో చెప్పకండి. భార్య తరచు అత్తమామల గురించి భర్తకు చెడుగా చెప్తూ ఉంటుంది. కానీ అలా చెప్పకూడదు. ఇది దంపతులు మధ్య సమస్యలను తీసుకొస్తుంది.
Advertisement
మీ భాగస్వామిని మీ మాజీ ప్రియుడు లేదా ప్రేయసి తో పోల్చకండి ఇలా చేస్తే కూడా కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి కాబట్టి ఈ జాగ్రత్తలు కూడా తీసుకోండి. అలానే వైవాహిక జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు భాగస్వామ్యం నిందించడం మానుకోవాలి అది నిజంగా పెద్ద తప్పు. అలానే మీ భాగస్వామి కోపంగా ఉన్నప్పుడు వాదిస్తే గొడవ మరింత ఎక్కువవుతుంది. శాంతంగా ఉండడమే మంచిది.
Advertisement
Also read:
అలానే భాగస్వామిని బాడీ షేవింగ్ చేయడం కూడా మంచిది కాదు. అది వాళ్ళ ఆత్మ గౌరవంను దెబ్బతీస్తుంది. భార్యాభర్తలు ఎప్పుడూ కూడా ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకోవాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. అలానే జీవిత భాగస్వామిని సంతోషపెట్టడానికి చూసుకోవాలి ఇలా జాగ్రత్తలు వహిస్తే మీ బంధం బాగుంటుంది లేదంటే అనవసరంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలానే మీ రిలేషన్షిప్ బాగుండాలంటే సరైన కమ్యూనికేషన్ కూడా చాలా అవసరం ఇలా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి అప్పుడే బంధం బాగుంటుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!