Advertisement
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ ని ఎక్కువగా వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయి అని ప్రతి ఒక్కరు గమనించాలి. ఫోన్ అనేది ఈ రోజుల్లో అత్యవసర సాధనంగా మారిపోయింది. ఫోన్ వినియోగం మంచి తో పాటుగా చెడుకు కూడా గురి చేస్తోంది. పెరిగిన ఫోన్ వినియోగం వ్యసనంలా మరి అనేక సమస్యలను తీసుకు వస్తోంది. ఫోన్ వినియోగం ఎంతలా పెరిగింది అంటే 24 గంటలు వాడుతూనే వుంటున్నారు.
Advertisement
పైగా బాత్రూంలోకి వెళ్లిన సరే చాలా మంది ఫోన్ ను ఉపయోగిస్తున్నారు. కానీ నిజానికి ఎట్టి పరిస్థితుల్లో ఈ పొరపాటు చేయకూడదు. డాక్టర్ ఈ విషయం గురించి చెప్తూ ఫోన్ కి అతుక్కుపోయి స్క్రోలింగ్ చెయ్యడం అనవసర ప్రదేశాల్లో ఎక్కువసేపు మాట్లాడటం మంచిది కాదని సూచించారు. ఫోన్ టాయిలెట్ లోకి తీసుకెళ్లినప్పుడు ప్రతి ఫ్లాష్ బ్యాక్టీరియాను గాలిలోకి పంపుతుంది. జెర్మ్స్ అన్ని కూడా ఫోన్ కి అంటుకుంటాయి.
Advertisement
Also read:
Also read:
ఈ క్రిముల కారణంగా కడుపు ఇన్ఫెక్షన్లు డయేరియా పేగు సంబంధిత సమస్యలతో పాటుగా మూత్ర వ్యాధులు, అంటూ వ్యాధులు కూడా వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. అంతేకాకుండా టాయిలెట్లో ఫోన్ ఎక్కువ సేపు వాడడం వలన అదనపు ఒత్తిడి పడుతుందట. పైల్స్ వంటి సమస్యలకు కూడా దారితీస్తుందట. టాయిలెట్ కి వెళ్ళినప్పుడు ఫోన్ వాడడం మంచిది కాదు. పైగా ప్రశాంతంగా ఉండాలంటే ఫోన్ కి దూరంగా ఉండాలి చాలామంది రిలాక్స్ అవ్వాలని ఫోన్ వాడుతూ ఉంటారు కానీ ఫోన్ ని పక్కన పెట్టేసి కాసేపు కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఫోన్ వాడడం వలన చాలామంది సమయాన్ని కూడా వృధా చేసుకుంటున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!