Advertisement
ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో సక్సెస్ అవ్వాలని అనుకుంటుంటారు. కానీ అందరికీ అది సాధ్యం కాదు. ఎంత కష్టపడినా కొందరికి సక్సెస్ రాదు. ఎంత కష్టపడినా సక్సెస్ రాకపోతే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం… ఇతరులకు సహాయం చేసే గుణం చాలా మంచిది. ఎందుకంటే దానగుణం కలిగిన వ్యక్తి అనేక సుఖ సౌఖ్యాలు అనుభవిస్తాడు అంతేకాకుండా ఆ వ్యక్తి జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. గొప్ప గొప్పగా దానధర్మాలు చేయకపోయినా ఉన్న దాంట్లో కొంత ఇతరులకి సహాయం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని పెద్దలు అంటున్నారు.
Advertisement
న్యాయపరమైన సంపాదనతో చేసే ఎలాంటి కార్యమైనా సరే అది మంచి ఫలితాలను ఇస్తుందట. మన చేతులతో మనం ఎంత దానం అయితే ఇస్తామో అంతకు రెట్టింపు మనకి వస్తుంది. కొన్ని కొన్ని సార్లు ఎంత కష్టపడినా సక్సెస్ రాకా ఫలితం లేక ఇబ్బంది పడుతూ ఉంటాము అలాంటప్పుడు ఇలా చేయమని పండితులు అంటున్నారు. కష్టాల నుండి విముక్తి పొందాలంటే ప్రతి రోజు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనె లేదంటే ఆవ నూనె తో దీపారాధన చేయాలని కొంత పంచదార చెట్టు యొక్క వేర్లలో పోసి నిదానంగా 11 ప్రదక్షిణాలు చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించాలని అన్నారు.
Advertisement
Also read:
Also read:
ఇలా చేయడం వలన కష్టాలు తొలగిపోతాయట. అనుకున్న పని జరుగుతుందట. వారానికి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు గోమాతకు గ్రాసం లాంటిది పెట్టి మూడుసార్లు గోవు చుట్టూ ప్రదక్షిణం చేస్తే చక్కటి ఫలితం ఉంటుందట. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కానీ శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు కానీ ఓం శ్రీ గణేశాయ అని చదువుకోవాలి ఇలా చేయడం వలన మనం వెళ్లే పని జరుగుతుందట ఆదివారం రోజు అని మాత్రమే కాకుండా ప్రతిరోజు సూర్యునికి నమస్కారం చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయట.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!