Advertisement
ప్రతి ఒక్కరు కూడా ఇళ్లల్లో కుక్కర్ వాడుతూ ఉంటారు. కుక్కర్ వాడడం వలన ఈజీగా వంట అయిపోతుంది. ఇదిలా ఉంటే కుక్కర్ నుండి లీకేజ్ అవుతూ ఉంటుంది దీని వలన మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనిని క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఏదైనా ఆహార పదార్థాలని ఈజీగా ఉడికించుకోవడానికి కుక్కర్ మనకి ఎంతగానో హెల్ప్ అవుతుంది. చాలామంది కొలవకుండానే నీళ్లు పోస్తూ ఉంటారు. నిజానికి కుక్కర్ లో ఎక్కువ నీళ్లు పోయడం వలన ఈ సమస్య వస్తుంది. ఈ నీటిని కుక్కర్ విజిల్ ద్వారా ఒక్కటే సారి పంపిస్తుంది దీనివలన ఆహారం మాడిపోవడం, కుక్కర్ విజిల్ పాడైపోవడం వంటివి జరుగుతాయి. పైగా క్లీన్ చేసుకోవడం కూడా పెద్ద సమస్య.
Advertisement
Advertisement
ఇటువంటివి కలగకుండా ఉండాలంటే ఈ తప్పులు చేయకండి. మీరు ఎక్కువ నీళ్లు వేసినట్లు మీకు సందేహం కలిగినట్లయితే హై లో పెట్టకుండా లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. అప్పుడు నీళ్ళు బయటికి రాకుండా ఉంటాయి. చాలామంది ఎక్కువ నీళ్లు పోసి హైలో పెడుతూ ఉంటారు దాని వలన లీక్ అవుతూ ఉంటుంది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే కుక్కర్ కి ఉండే రబ్బర్ సరిగ్గా పెట్టరు. మూత క్లోజ్ చేసేస్తారు.
Also read:
ఇది సరిగ్గా పెట్టకుండా మూత క్లోజ్ చేయడం వలన ఇబ్బంది వస్తుంది. కుక్కర్ ని క్లోజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిట్ అయ్యిందా లేదా సరిగ్గా చూసుకొని అప్పుడు మాత్రమే గ్యాస్ ఆన్ చేయండి. ఏమైనా ఫిట్టింగ్ సరిగ్గా లేకపోతే కూడా లీక్ అవుతుంది. చాలామంది ఈ తప్పు చేస్తూ ఉంటారు. అలాగే కుక్కర్ క్లీన్ చేస్తారు కానీ చాలామంది విజిల్ ని క్లీన్ చేయరు. విజిల్ సరిగ్గా క్లీన్ అవ్వకపోవడం వలన కూడా ఈ సమస్య రావచ్చు. సో ఇకమీదట ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!