Advertisement
ఒంటరిగా ఉన్నామని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలి..? ఒంటరితనాన్ని ఎలా అధిగమించాలి అనే దాని గురించి చూద్దాం. ఒంటరితనంలో బాధపడేవాళ్లు ఇంట్రెస్ట్ ఉన్న ఏదైనా ఒక సోషల్ క్లబ్ లేదా ఆర్గనైజేషన్ లో చేరడం మంచిది. మ్యూజిక్ క్లబ్, బుక్ క్లబ్ ఇలా దేనిలోన చేరడం మంచిది దీని వలన ఒంటరితనం నుండి త్వరగా బయటపడడానికే అవుతుంది. అలానే ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఒత్తిడికి గురవడం మంచిది కాదు. మీరు కొత్త అలవాటు ప్రయత్నం చేయండి.
Advertisement
మ్యూజిక్, ఇండోర్ గేమ్స్, పెయింటింగ్ లేదా ఇతర వాటిపై ఫోకస్ పెట్టండి. ఒంటరితనంతో బాధపడే వాళ్ళు ఎన్జీవో లో వాలంటీర్ గా పనిచేయడం మంచిది దీని వలన కమ్యూనిటీ పెరుగుతుంది, మనసుకి ఎంతో ప్రశాంతత కలుగుతుంది. ఒంటరిగా ఫీల్ అయ్యే వారు వంట చేస్తే కూడా ఒంటరితనం నుండి బయటపడొచ్చు. మీకు నచ్చే వంటకం తయారు చేయండి కొత్తగా ప్రయత్నించి ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒంటరితనాన్ని దూరం చేయడానికి మెడిటేషన్ కూడా సాయం చేస్తుంది. ఒత్తిడి, డిప్రెషన్ కూడా దూరం అవుతుంది.
Advertisement
Also read:
అలానే వ్యాయామం చేస్తే కూడా ప్రశాంతంగా ఉండొచ్చు ఒంటరితనం పోతుంది. రిలాక్స్డ్ గా ఉండొచ్చు. ఎంతో ప్రశాంతత వస్తుంది. కండరాలు రిలాక్స్ అవుతాయి. వ్యాయామం చేయడం ఇష్టం లేకపోతే డాన్స్ క్లాస్, స్పోర్ట్స్ వంటి వాటిపై కూడా దృష్టి పెట్టొచ్చు. ఒంటరిగా ఉన్నాం అనుకుంటే స్నేహితులతో అలా ఎక్కడికైనా వెళ్ళండి. ఔటింగ్ కి వెళ్లి రావడం వలన ఎంతో ప్రశాంతత ఉంటుంది. వయసులో పెద్ద వాళ్ళు ఒంటరిగా ఫీల్ అయితే ఆధ్యాత్మిక వైపు ప్రయాణించడం మంచిది దగ్గరలోని ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లడానికి ప్రయత్నం చేయండి థెరపీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా వీటిని ఫాలో అయ్యారంటే ఒంటరిగా అనిపించదు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!