Advertisement
కార్తీకమాసంలో చేసే పూజలకు, ఉపవాసాలకి ఎంతో పుణ్యం వస్తుంది. ధర్మబద్ధమైన ఎలాంటి కోరిక అయినా నెరవేరాలంటే కార్తీక మాసం చాలా మంచిది. కార్తీక మాసంలో పరమేశ్వరుడిని ఆరాధించడం వలన అంతులేని తెలివితేటలతో పాటుగా మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. అలాగే గౌరవం కలుగుతుంది. జీవితంలో అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. పెళ్లి కానీ వాళ్ళు భక్తితో శివుడిని ఆరాదిస్తే విఘ్నాలన్నీ తొలగిపోయి.. మంచి జీవిత భాగస్వామి కలుగుతారు.
Advertisement
జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే శివుని అనుగ్రహం ఉంటే చాలట, అలాగే నవగ్రహాలు ఒక్కో గ్రహానికి ఒక్కో దేవత ఉంటుంది. వాటిని శివుడు చూస్తారు. గ్రహాలన్నీ శివుడు ఆదీనంతో ఉంటాయి. అందుకని దోష పరిహారాలు చేయలేకపోతే శివుడు అర్చన, అభిషేకాలు చేస్తారు. పెళ్లి ఎంతో ముఖ్యమైనది. గురుబలం రావాలన్నా శుక్ర దోషాలు తొలగిపోవాలన్నా శివుని అనుగ్రహం ఉంటే చాలు.
Advertisement
Also read:
కార్తీక మాసంలో శుక్లపక్ష పున్నమి రోజుకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. దీనిని కౌశిక లేదా వైకుంఠ పౌర్ణమి అని అంటారు. ఈ రోజు నా తెల్లవారే ముందు స్నానం చేసి గుమ్మడ ఆకు, వక్క, పండ్లు బ్రాహ్మణుడికి ఇవ్వాలి. అలాగే ముత్తైదువుకు వాయినాలు ఇవ్వాలి. ఈరోజు ఉపవాసం ఉండి సాయంత్రం అరటి దున్నెలో దీపాలని వెలిగించాలి పసుపు కుంకుమ చల్లి నదులు కాలవల్లోకి వెళ్తూ ఉంటారు. ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది. పౌర్ణమినాడు కాకపోయినా 41 రోజులు నేటితో లింగాన్ని అభిషేకించినా ఎన్నో రెట్లో ఫలితం ఉంటుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!